Begin typing your search above and press return to search.

ఈ కెలుకుడు అవసరమా చంద్రన్నా...?

By:  Tupaki Desk   |   15 Oct 2022 3:30 PM GMT
ఈ కెలుకుడు అవసరమా చంద్రన్నా...?
X
చంద్రబాబు సీఎంగా ముమ్మారు పనిచేశారు. విజన్ ఉన్న నేత. ఆయన హైటెక్ సిటీ సృష్టికర్త. ఐటీ కోసం తపన పడ్డవారు ఇలా ఈనాటి యువతరం బాబు గురించి చాలా చెప్పుకుంటుంది. బాబు పాలనలో ప్లస్ మైనస్ రెండూ ఉన్నాయి. అయితే కొన్ని విషయాల్లో అయన సీఎం గా సక్సెస్ అయ్యారు. ఆ ఇమేజ్ పునాదుల మీదనే ఆయన తిరిగి అధికారంలోకి రావాలి. దానినే నమ్ముకోవాలి.

కానీ తీరు చూస్తూంటే చంద్రబాబు ఎపుడో ఇరవై ఏడేళ్ల క్రితం నాడు జరిగిన వెన్నుపోటు ఎపిసోడ్ ని తెర ముందుకు కోరి మరీ తెచ్చి కెలుక్కున్నారా అనిపిస్తుంది. తన తప్పు ఏమీ లేదని బాబు చెప్పుకోవడానికి బాలయ్య టాక్ షోలో ప్రయత్నం చేయవచ్చు కానీ అసలు అదంతా అవసరమా అన్న చర్చ అయితే ముందుకు వస్తోంది. నిజానికి ఈ తరానికి ఎంటీయార్ వెన్నుపోటు గురించి పెద్దగా తెలియదు, ఆసక్తి కూడా లేదు.

కానీ కోరి మరీ కెలికి తన పాత తప్పును బాబు జనం ముందు పెట్టుకున్నారు అని అంటున్నారు. ఎన్టీయార్ కాళ్ళు పట్టుకున్నా వినలేదని అందుకే దించేశామని బాబు సమర్ధించుకోవచ్చు. కానీ కామన్ గా అందరికీ తట్టే విషయం ఏంటి ఒక పెద్దాయన్ని పిల్లను ఇచ్చిన మామను ముదిమి వయసులో కుర్చీ నుంచి నిర్ధాక్షిణ్యంగా దించేశారు అనే కదా.

ఎవరూ కూడా లోతుపాతుల్లోకి పోరు. ఆనాడు పరిస్థితులు ఏంటి. ఎన్టీయార్ మాజీ కావడానికి దారి తీసిన విషయాలు ఏంటి అన్నది ఎవరూ పెద్దగా ఆలోచించరు. ఆయనను నుంచి పదవి లాక్కున్నారు. ఫలితంగా ఆయన మరణించారు ఇదే జనం బుర్రల్లోకి వెళ్తుంది. ఈ విధంగా తెలియకుండానే తన ఫ్లాష్ బ్యాక్ గురించి చెబుతూ బాబు ఇప్పటి జనాలకు కొత్త కోణాన్ని తెలియని అనవసరం వైనాన్ని తెలిసేలా చెప్పారు అని అంటున్నారు.

ఇక ఎన్టీయార్ ని దించేశాక కూడా బాబు రెండు సార్లు సీఎం అయ్యారు అంటే అది ఆయన పాలనాతీరుని బట్టి తప్ప మరోటి కాదు, రేపైనా మరోసారి అయినా బబు చెప్పుకుంటే తాను చేసిన అభివృద్ధి తన పాలన గురించే చెప్పుకోవాలి తప్ప సానుభూతి కోసమో, లేక ఎన్టీయార్ లెగసీ కోసమో చెబితే ఓట్లు రాలవు. పైగా ఎన్టీయార్ వెన్నుపోటు ఎపిసోడ్ మీద స్వయంగా అన్న గారు చివరి రోజుల్లో ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూలు ఇప్పటికీ యూ ట్యూబులలో భద్రంగా ఉన్నాయి.

అందువల్ల బాబు ఏమి చెప్పినా చెప్పకపోయినా జనాలు తాము ఈ విషయంలో ఏ రకామైన అభిప్రాయంతో ఉన్నారో దాన్ని మార్చుకోరు. కేవలం టాక్ షోల వల్ల బాబుకు కొత్తగా వెన్నుపోటు మచ్చ పోయేది ఉండదు. అలగే బాబు మంచే చేశారు అనుకున్న వారికి ఇలాంటి వివరణలతో సంబంధం లేదు. కానీ కోరి మరీ పాత విషయాలను కెలుక్కుని చంద్రబాబు వెన్నుపోటు ఎపిసోడ్ ని సరికొత్తగా ఈ నాటి తరానికి పరిచయం వల్ల ప్రత్యర్ధి వర్గానికి ఆయుధం ఇచ్చినట్లు అవుతుంది అనే అంటున్నారు. అలాగే ఇది మరింతగా రచ్చగా సాగడం వల్ల తలనొప్పులు తప్ప ఇంకేమీ ఒనకూడేది ఉండదనే అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.