Begin typing your search above and press return to search.
కేసీయార్ వ్యూహం ఇదేనా ?
By: Tupaki Desk | 25 Jun 2021 9:31 AM GMTఎప్పుడేమి మాట్లాడాలో ? ఎప్పుడెవరితో మాట్లాడించాలో కేసీయార్ కు బాగా తెలుసు. కావాలనే జనాల్లో ఉద్వేగాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవటంలో కేసీయార్ చాలా ఆరితేరిపోయిన విషయం ఇప్పటికే అందరికీ అర్ధమైపోయింది. కారణం లేకుండా కేసీయార్ ఏ విషయాన్ని లేవనెత్తరని ఇప్పటికి ఎన్నోసార్లు నిరూపణైంది. తాజాగా తెలంగాణా-ఏపీ మధ్య జల వివాదాలు హఠాత్తుగా తెరమీదకు రావటం కూడా ఇందులో భాగమనే ఆరోపణలు కేసీయార్ పై పెరిగిపోతున్నాయి.
ఇంతకీ విషయం ఏమిటంటే తొందరలోనే హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక జరగబోతోంది. బహిష్కృత మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. తెలంగాణా ఉద్యమంలో ఈటల కూడా సంవత్సరాలపాటు ముందు వరసలోనే ఉన్నారు. అందుకనే హుజూరాబాద్ నియోజకవర్గంలో వరుసగా నాలుగుసార్ల నుండి ఓటమిన్నదే లేకుండా గెలుస్తునే ఉన్నారు. ఉద్యమనేతగానే కాకుండా జనాల్లో కూడా ఈటలకు మంచి పట్టేఉంది.
ఉపఎన్నికలో ఈటలను ఓడించటమంటే మామూలువిషయం కాదని కేసీయార్ కు అర్ధమైనట్లుంది. ఇండిపెండెంట్ అభ్యర్ధిగా రంగంలోకి దిగేట్లయితే కత వేరే విధంగా ఉండేది. కానీ ఈటలేమో పోయి బీజేపీలో చేరిపోయారు. రేపటి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేయబోయే ఈటల డెఫనెట్ గా బలమైన ప్రత్యర్ధవుతారనటంలో సందేహంలేదు. ఎన్నికల సమయంలో పోలీసులదే రాజ్యమంతా అని కొత్తగా చెప్పక్కర్లేదు.
బీజేపీ అభ్యర్ధిగా పోటీచేయబోతున్న ఈటలపైకి పోలీసులను ఇష్టమొచ్చినట్లు ఉసిగొలిపి ఇబ్బంది పెట్టేందుకు లేదు. ఈ విషయం మొన్నటి దుబ్బాక ఉపఎన్నికలోనే కేసీయార్ కు అర్ధమైపోయింది. అందుకనే ఏకంగా జనాలనే రెచ్చగొట్టే వ్యూహానికి కేసీయార్ తెరతీసినట్లు ప్రచారం జరుగుతోంది. కేవలం రాబోయే ఉపఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కేసీయార్ మళ్ళీ తెలంగాణా సెంటిమెంట్ ను తెరపైకి తెచ్చినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ పెరిగిపోతోంది. మరి జనాలో కేసీయార్ ఉచ్చులో పడతారా ? చూడాల్సిందే ఏమి జరుగుతుందో ?