Begin typing your search above and press return to search.

దీదీ రాజ్యంలో ఇంత దారుణమా? ఇంట్లోకి వెళ్లి మరీ గ్యాంగ్ రేప్.. భారీ చోరీ

By:  Tupaki Desk   |   8 July 2021 4:25 AM GMT
దీదీ రాజ్యంలో ఇంత దారుణమా? ఇంట్లోకి వెళ్లి మరీ గ్యాంగ్ రేప్.. భారీ చోరీ
X
దారుణం చోటు చేసుకుంది. విన్నంతనే ఉలిక్కిపడే ఈ ఉదంతం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. తన దారిన తాను ఉన్న ఒక మహిళను ఇంట్లోకి చొరబడి మరీ దారుణంగా సామూహిక అత్యాచారం చేసిన వైనం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఈ దుర్మార్గ ఘటనకు వేదికగా మారింది పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్ కతా మహానగరం. ఒక స్ట్రాంగ్ ఉమెన్ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. షాకింగ్ గా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..

కోల్ కతా మహానగరంలోని గార్డెన్ రీచ్ ప్రాంతంలోని ఒక అపార్ట్ మెంట్లో తాజాగా గ్యాంగ్ రేప్ జరిగినట్లుగా చెబుతున్నారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు 26 ఏళ్లు ఉండే యువతి ప్లాట్ లోకి అక్రమంగా ప్రవేశించారు. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఇంట్లోని రూ.15 లక్షల క్యాష్ ను చోరీ చేయటం మరింత షాకింగ్ గా మారింది. ఇంతకీ ఆమె ఇంట్లోకి ఎలా ప్రవేశించారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. మంగళవారం చోటు చేసుకున్న ఈ దారుణం ఒక రోజు ఆలస్యంగా బయటకు వచ్చింది.

ఈ అమానుష చర్య గురించి తెలిసిన వెంటనే బాధితురాలిని ఆసుపత్రిలో చేర్చి వైద్య సాయం అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని చెబుతున్నారు. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లుగా వైద్యులు తేల్చారు. దీంతో.. దీనికి కారణమైన నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం వేళలో.. బాధిత యువతి అపార్ట్ మెంట్ కు వచ్చిన గుర్తు తెలియని యువకులు.. ఆమె ప్లాట్ లోకి వచ్చారు.

అయితే.. లోపలకు ఎలా రాగలిగారు? అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. పోలీసు వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. బాధితురాలికి తెలిసిన వ్యక్తులే ఆమెపై అత్యాచారానికి పాల్పడి ఉంటారా? అన్నది మరో ప్రశ్నగా మారింది. రేప్ చేయటానికి వచ్చినోళ్లకు ఇంట్లో దాచిన రూ.15లక్షల గురించి ఎలా తెలిసిందన్న అనుమానానికి సమాధానం దొరకాల్సి ఉంది. ఈ ఉదంతాన్నిసీరియస్ గా తీసుకున్న గార్డెన్ రీచ్ పోలీస్ స్టేషన్ పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు.

కోల్ కతా పోలీసు డిటెక్టివ్ డిపార్ట్ మెంట్ కూడా ఈ ఉదంతంలోని మిస్టరీని తేల్చే పనిలో బిజీగా ఉంది. మహిళ ప్లాట్ నుంచి ఫోరెన్సిక్ టీం సభ్యులు కీలక ఆధారాల్ని సేకరించినట్లుగా చెబుతున్నారు. గ్యాంగ్ రేప్ నకు గురైన బాధిత మహిళను మంచానికి కట్టేసి అత్యాచారానికి పాల్పడి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఇంట్లో ఉన్న మహిళకు భద్రత లేకపోవటం.. అది కూడా దీదీ లాంటి మహిళ అధికారంలో ఉన్న రాష్ట్రం కావటం ఇప్పుడు చర్చనీయాంశాలుగా మారాయి.