Begin typing your search above and press return to search.

ప్రత్యర్ధుల విషయంలో బీజేపీ వ్యూహం ఇదేనా ?

By:  Tupaki Desk   |   29 Dec 2021 9:31 AM GMT
ప్రత్యర్ధుల విషయంలో బీజేపీ వ్యూహం ఇదేనా ?
X
ఎంత సేపు తమ ప్రత్యర్ధులను బెదిరించి అదుపు లో పెట్టుకోవటానికే బీజేపీ నతేలు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణా విషయం మాట్లాడితే కేసీయార్ ను జైలుకు పంపుతామంటున్నారు. విజయవాడలో మాట్లాడితే పేరు ప్రస్తావించకుండానే జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రద్దవుతుందని, జైలుకు వెళతారని ఒకటే సొద వినిపిస్తున్నారు. తెలంగాణాలో కేసీయార్ ను, ఏపీలో జగన్ను జైలుకు పంపితే కానీ తమ పార్టీకి బతుకులేదని కమలనాదులకు బాగా అర్ధమైనట్లుంది.

కేసీయార్ ను జైలుకు పంపుతామని తెలంగాణా అధ్యక్షుడు బండిసంజయ్ ఇప్పటికి వందసార్లు చెప్పుంటారు. అలాగే జగన్ గురించి ఇదే మాట ఏపీలో చెబుతున్నారు. మరలాంటపుడు ఇంకా ఎందుకు ఇద్దరినీ జైలుకు పంపకుండా వెయిట్ చేస్తున్నట్లు ? ఎందుకంటే బెయిల్ రద్దు చేయటమైనా, జైలుకు పంపటమైనా బీజేపీ చేతిలో లేదు కాబట్టే. ఉత్తినే బెయిల్ రద్దు చేస్తామని, జైలుకు పంపుతామని బెదిరిస్తు ప్రత్యర్ధులను తమ చెప్పుచేతల్లో ఉంచుకోవటమే బీజేపీ వ్యూహంగా కనబడుతోంది.

తాజాగా జరిగిన ప్రజాగ్రహసభలో సీనియర్ నేత ప్రకాష్ జవదేకర్ మాట్లాడుతు జగన్ పేరు ప్రస్తావించకుండానే బెయిల్ రద్దుయి జైలుకు వెళతారని చెప్పటమే విచిత్రంగా ఉంది. ఒకవేళ వ్యవస్ధలన్నీ బీజేపీ చెప్పినట్లే వింటాయని అనుకున్నా జగన్ను జైలుకు పంపితే బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుందా ? జగన్ను జైలుక పంపటం బీజేపీ చేతిలో పనే అనుకున్నా ప్రజలతో ఓట్లు వేయించుకోవటం బీజేపీ చేతిలో లేదుకదా.

జగన్ను జైలుకు పంపిస్తే తాము అధికారంలోకి వచ్చేస్తామని కలలు కంటే బీజేపీ నేతలు తప్పులో కాలేసినట్లే. ఇన్నేసి సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నవారు కూడా జనాల నాడిని తెలుసుకోలేకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. జవదేకర్ చెప్పినట్లుగా బెయిల్ రద్దుచేసి జగన్ను జైలుకు పంపితే అంతా హ్యాపీయే. మరాపని ఎందుకని చేయటంలేదు. ఎలాగూ బెయిల్ రద్దు అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. కాబట్టి బెయిల్ రద్దు చేయించటం బీజేపీకి చాలా సులభం.

జనాల మనసులను ఎలా గెలుచుకోవాలా అన్న విషయాలను వదిలిపెట్టేసి ప్రత్యర్ధులను దెబ్బ కొడితే మాత్రమే అధికారం సాధ్యమని కమలనాదులు ఫిక్సయినట్లున్నారు. మరి ఇంకా ఎందుకు ఆలస్యం వెంటనే ఆపనేదో చేసేసి పుణ్యం కట్టుకుంటే రెండు రాష్ట్రాల్లోను బీజేపీ ఒకేసారి అధికారంలోకి వచ్చేస్తుంది కదా. మెజారిటి లేకపోయినా కొన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేసినట్లే తెలుగు రాష్ట్రాల్లో కూడా అలాగే ప్లాన్ చేస్తే ఒకపనై పోతుంది.