Begin typing your search above and press return to search.

జోడో యాత్ర జీవం పోసేనా.. ఏపీలో కాంగ్రెస్ భ‌విష్య‌త్తు ఇదేనా..!

By:  Tupaki Desk   |   24 Oct 2022 8:13 AM GMT
జోడో యాత్ర జీవం పోసేనా.. ఏపీలో కాంగ్రెస్ భ‌విష్య‌త్తు ఇదేనా..!
X
ఏపీ కాంగ్రెస్ ప‌రిస్థితి ఏంటి? పార్టీ పుంజుకునే అవ‌కాశం ఉందా? వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా.. క‌నీసం 10 స్థానాల్లో గెలుపు గుర్రం ఎక్కేనా.. గౌర‌వ ప్ర‌ద‌మైన ఓటు బ్యాంకును సొంతం చేసుకునేనా..? ఇదీ.. ఇప్పుడు జ‌రుగుతున్న కీల‌క చ‌ర్చ‌. ఎందుకంటే..

ఇటీవ‌లే పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీ రాష్ట్రంలో భార‌త్ జోడో యాత్ర చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కీల‌క‌మైన ప్ర‌క‌ట‌నలు చేశారు. రాజ‌ధాని అమ‌రావ‌తికే తాము మొగ్గు చూపుతామ‌ని.. ఇక్క‌డి రైతుల‌కు.. తాము అండ‌గా ఉంటామని.. ఏపీకి ఏకైక రాజ‌ధానిగా అమ‌రావ‌తి మాత్ర‌మే ఉంటుంద‌ని వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. పోల‌వ‌రం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్య‌త కూడా తాము తీసుకుంటామ‌ని రాహుల్ హామీ ఇచ్చారు. అదే స‌మ‌యంలో కేంద్రంలో తాము అధికారంలోకి రాగానే.. ఖ‌చ్చితంగా ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌న్నారు. ఇవ‌న్నీ కూడా.. ఒక పార్టీగా 2014లో ఇచ్చిన హామీలు కావ‌ని పార్ల‌మెంటు సాక్షిగా.. ఏపీకి ద‌క్కిన హ‌క్కుల‌ని కూడా ఆయ‌న చెప్పుకొచ్చారు. అదే స‌మ‌యంలో.. రాజ‌ధాని రైతుల‌తోనూ.. ఇత‌ర ప్ర‌జ సంఘాల నాయ‌కుతోనూ.. ఆయ‌న చ‌ర్చించారు. స‌మ‌స్య‌లు విన్నారు. వారికి ఓదార్పు ఇచ్చే వ్యాఖ్య‌లు చేశారు.

వాస్త‌వానికి రాహుల్ రాష్ట్రంలో పాద‌యాత్ర చేసింది కేవ‌లం క‌ర్నూలు జిల్లాకే ప‌రిమితం అయినా.. అది కూడా.. అతిత‌క్కువ రోజులే అయినా... రాహుల్ చేసిన వ్యాఖ్య‌లు మాత్రంకీల‌కంగా మారాయి. ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఏపీ ప్ర‌జ‌లు కోరుకుంటున్న వాటినే.. అమ‌లు సాధ్యం కాద‌ని..

కేంద్రంలో ఉన్న మోడీ చెప్పిన వాటినే ఆయ‌న తాము అధికారంలోకి వ‌స్తే.. అమ‌లు చేస్తామ‌ని చెప్పారు. ఈ విష‌యాలు ఏమీ.. త‌క్కువ కాదు.. వీటిని స‌రైన దిశ‌లో ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్తే.. ఖ‌చ్చితంగా వారి నుంచి సింప‌తీ సొంతం చేసుకునే అవ‌కాశం కాంగ్రెస్‌కు ఉంటుంది.

అయితే.. ఆదిశ‌గా కార్య‌క్ర‌మాలు చేసే కార్యకర్త‌లు.. సొమ్ములు ఖ‌ర్చు చేసే నాయ‌కులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కనిపించ‌డం లేదు. ఎందుకంటే.. ఇటీవ‌ల రాహుల్ పాద‌యాత్ర నిర్వ‌హించ‌డానికే త‌మ‌ద‌గ్గ‌ర డ‌బ్బులు లేవ‌ని.. పార్టీ నాయ‌కులు చేతులు ఎత్తేశారు. దీంతో క‌ర్ణాట‌క‌కు చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు.. వ్యాపారి.. డీకే శివ‌కుమార్‌ను ఖ‌ర్చులు భ‌రించాల‌ని.. పార్టీ ఆదేశించింది. మ‌రి ఇలాంటి ప‌రిస్థితి కీల‌క‌మైన అవ‌కాశాన్ని కాంగ్రెస్ స‌ద్వినియోగం చేసుకుంటుందో వ‌దులుకుంటుందో ? చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.