Begin typing your search above and press return to search.

రాజాసింగ్ భద్రతకే ముప్పు.. చెడిపోయిన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం

By:  Tupaki Desk   |   14 Nov 2022 1:30 PM GMT
రాజాసింగ్ భద్రతకే ముప్పు.. చెడిపోయిన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం
X
ఒక మత ప్రవక్తపై నోరుజారిన రాజాసింగ్ కేసుల పాలై... రెండు నెలలు జైలుకు కూడా వెళ్లివచ్చారు. ఉగ్రవాదుల నుంచి ఆయనకు ముప్పు పొంచి ఉందన్న వార్తలతోపాటు ఓ వర్గం వారు అతడిపై దాడికి కూడా పాల్పడవచ్చని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించడంతో రాష్ట్ర ఇంటెలిజెన్స్ సంస్థ ఆయనకు ఒక బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని కేటాయించింది. ఆ వాహనంలోనే కోర్టు కేసులకు హాజరవుతున్న రాజాసింగ్ తరచూ మరమ్మతులకు గురవుతున్న ఆ వాహనాన్ని చూసి మండిపడుతున్నారు.

4 నెలల క్రితం రోడ్డు మధ్యలోనే ఈ బుల్లెట్ ఫ్రఫ్ వాహనం మధ్యలోనే ఆగిపోయింది. అప్పుడు ఆ వాహనాన్ని తిరిగి ఇంటెలిజెన్స్ కార్యాలయానికి తిరిగి పంపించాడు రాజాసింగ్. మరమ్మతులు చేసి మళ్లీ అదే వాహనాన్ని ఇచ్చారు. 2 నెలల క్రితం నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లే సమయంలో కూడా ఆ వాహనం మళ్లీ ఆగిపోయింది. ఆ టైంలో గన్ మెన్ల సాయంతో తనను ఆటోలో కోర్టుకు తీసుకెళ్లారు.

అప్ఘల్ గంజ్ వద్ద కూడా ఆ వాహనం మరోసారి ఆగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో మరోదారి లేక.. తన సొంత వాహనాన్నే రప్పించుకొని వెళ్లానన్నారు. ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్న తనకు ఇంటెలిజెన్స్ అధికారులు ఇలాంటి వాహనం ఇస్తారా? అని రాజాసింగ్ అసహనం వ్యక్తం చేశారు.

కండీషన్ లోని లేని వాహనంలో తనకు ఏ మాత్రం భద్రత ఉండదని.. ఈ విషయాన్ని పోలీస్ అధికారుల దృష్టికి గతంలోనే తీసుకెళ్లినా.. అధికారులు స్పందించలేదని ఆయన ఆవేదన చెందారు. కాగా.. పీడీ యాక్ట్ కేసులో ఇటీవల జైలుపై రాజాసింగ్ జైలు నుంచి రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఎలాంటి ప్రెస్ మీట్ లు ఇవ్వకూడదని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టరాదని.. ర్యాలీలు కూడా నిర్వహించకూడదన్న షరతులతో ఆ బెయిల్ ను మంజూరు చేసింది.

వివాదాస్పద స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ కామెడీ షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతివ్వడం ఈ గొడవకు కారణమైంది.. శిల్పాకళ వేదికలో మునావర్ షో జరిగింది. హిందూ దేవతలను అవమానిస్తూ గతంలో వ్యాఖ్యలు చేసిన ఇలాంటి వ్యక్తికి అనుమతి ఇవ్వడం పట్ల బీజేపీ , హిందూ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ముఖ్యంగా నాటి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. మునావర్ ఫారూఖీ కామెడీ షోను అడ్డుకుంటామని స్పష్టం చేశాడు. పోలీసులు అనుమతి ఇవ్వవద్దని కోరారు. ఈ క్రమంలో ఓ మత ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. కేసుల పాలై జైలుకు కూడా వెళ్లొచ్చాడు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.