Begin typing your search above and press return to search.

పరకాలను బాబు వదిలించుకున్నారా? అదే ఆయన అక్రోశానికి కారణమా?

By:  Tupaki Desk   |   22 Aug 2021 8:11 AM GMT
పరకాలను బాబు వదిలించుకున్నారా? అదే ఆయన అక్రోశానికి కారణమా?
X
టీడీపీ అధినేత చంద్రబాబుకు రాజకీయ సలహాదారుగా వ్యవహరించిన పరకాల ప్రభాకర్ ఇటీవల వార్తల్లో వ్యక్తిగా నిలవటం తెలిసిందే. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద ఘాటైన విమర్శలు సంధిస్తూ.. ట్వీట్ల మీద ట్వీట్లు చేసిన ఆయన తీరు చాలామందికి విస్మయానికి గురి చేసింది. పరకాల లాంటి పెద్ద మనిషి నోటి నుంచి ఇలాంటి మాటలా? ఇంతలా విరుచుకుపడటమా? అన్న ప్రశ్న తలెత్తింది. ఇంతకీ.. పరకాల కోపానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు సరైన సమాధానం లభించలేదనే చెప్పాలి.

అయితే.. తాజాగా ఒక ఆసక్తికర వాదన వినిపిస్తోంది. చంద్రబాబుకు.. పవన్ కు మధ్య గ్యాప్ తగ్గించే ప్రయత్నాలు సాగుతున్నాయని.. ఇందుకోసం కొందరు ప్రత్యేకంగా ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. 2024లో జరిగే ఎన్నికల సమయానికి జనసేనతో జత కట్టాలని బాబు డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ పార్టీని ఎదుర్కోవటం అంత తేలికైన విషయం కాదన్న విషయాన్ని గ్రహించిన ఆయన.. తనబలానికి తోడు అదనపు బలాన్ని పవన్ రూపంలో తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.

పవన్ రావటం అంటే.. పవన్ తో పాటు కాపు సామాజిక వర్గం.. బీసీలు కూడా పార్టీ వైపు మొగ్గు చూపే వీలుంటుందన్న వాదనా వినిపిస్తోంది. అందుకే.. పవన్ తో ఉన్న పేచీల్ని పక్కన పెట్టేసి.. కలిసిపోవాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతారు. అయితే.. ఈ వ్యవహారంపై పరకాల అంత పాజిటివ్ గా లేరని చెబుతారు. ఇదే బాబుకు.. పరకాలకు దూరం పెంచటమే కాదు.. బాబుతో తన లింకు తెగటానికి పవన్ కారణమన్న గుర్రు ఆయనలో ఉందని చెబుతారు. ఇదే.. పవన్ మీద ఆయనకు కట్టలు తెగే కోపానికి ఒక కారణంగా చెబుతారు.

పవన్ తో జత కట్టే విషయంలో పరకాల ఆలోచనలు వేరుగా ఉన్న నేపథ్యంలో.. ఆయన వెంట ఉంటే జనసేనతో జత కట్టేది కష్టమేనని భావించిన చంద్రబాబు.. ఆయన్ను పక్కన పెట్టేశారని చెబుతున్నారు. ఇలా తనకు రాజకీయ సలహాదారుగా వ్యవహరించే పరకాలకు గుడ్ బై చెప్పినట్లుగా తెలుస్తోంది.