Begin typing your search above and press return to search.
కలుపు ఏరేసే ఆపరేషన్ మొదలైందా? థరూర్ ఎపిసోడ్ అందుకేనా?
By: Tupaki Desk | 29 Aug 2020 6:50 AM GMTఅంతర్గత ప్రజాస్వామ్యం టన్నుల కొద్దీ ఉండే కాంగ్రెస్ పార్టీలో.. ఇటీవల కాలంలో ఎప్పుడూ చోటు చేసుకోని పరిణామాలు చోటు చేసుకోవటం తెలిసిందే. పార్టీకి గుండెకాయ లాంటి గాంధీ ఫ్యామిలీలోని ఒకరిపై గుప్పెడు మంది (23 మంది) సీనియర్లు ఒక జట్టుగా చేరి లేఖ రాయటం.. అది కాస్తా మీడియాకు లీక్ కావటం.. తదనంతర పరిణామాలు తెలిసిందే.
ఏదో పొరపాటున జరిగిందనే అనుకున్నా.. ఆ తర్వాత చోటు చేసుకున్న పరినాలు చూస్తున్న వారికి.. రాహుల్ మీద సీనియర్లు గుర్రుగా ఉన్నారని.. తమను అలక్ష్యం చేసే అతగాడికి షాక్ ట్రీట్ మెంట్ ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. పలువురు సీనియర్లు కట్టకట్టుకొని ఇలా చేయటం వెనుక పార్టీఅధినాయకత్వం తమకు తగిన గుర్తింపుతో పాటు.. తమను విస్మరిస్తే.. ఎలాంటి చిక్కులు ఎదురవుతాయన్న విషయాన్ని చెప్పకనే చెప్పేస్తున్నారు.
సీనియర్లు ఇచ్చిన షాక్ తీవ్రతను గుర్తించిన పార్టీ అధినేత్రి సోనియాగాంధీ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. లోక్ సభలోనూ రాజ్యసభలో పలు పదవుల్లో ఉన్న వారిని మార్చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక.. ఇలాంటి వాటికి థింక్ టాంక్ గా అభివర్ణించే మరికొందరిపైనా సోనియా విధేయులు టార్గెట్ పెట్టినట్లుగా కనిపిస్తోంది. ఈ వాదనకు బలం చేకూరేలా కేరళ కాంగ్రెస్ నేత శశిథరూర్ ఎపిసోడ్ ను చెబుతున్నారు.
ఇటీవల కాలంలో పలు అంశాలపై పార్టీ లైన్ కు భిన్నంగా వ్యాఖ్యలు చేసిన శశిథరూర్ పై తాజాగా పార్టీ ఎంపీ కోడిక్కున్నిల్ సురేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన రాజకీయ నేత కాదని.. గెస్టు ఆర్టిస్టుగా పేర్కొన్నారు. థరూర్ గ్లోబల్ సిటిజన్ కావొచ్చని.. తెలివైన వారు కూడా అవ్వొచ్చని.. కానీ ఆయన పార్టీ నాయకుడు ఏమీ కాదని తేల్చేశారు. ఇప్పటికి తమ పార్టీలో గెస్టు ఆర్టిస్టుగానే వ్యవహరిస్తున్నారని చెప్పారు.
ఆయనకు ఆయన తనకు తోచినట్లుగా నిర్ణయాలు తీసుకోవటానికి వీల్లేదని.. ఎవరైనా సరే పార్టీ నిబంధనలకు అనుగుణంగానే నడుచుకోవాలని తేల్చారు. ఇదంతా చూస్తుంటే.. గాంధీ కుటుంబంపై కత్తి కట్టినట్లుగా లేఖాస్త్రాన్ని సంధించిన నేతలందరి విషయంలో ఏదోలా తగిన చర్యలు షురూ అయినట్లుగా చెబుతున్నారు. అధినాయకత్వానికి టోకుగా షాకిచ్చిన సీనియర్లలో ఒక్కొక్కకరి ఒక్కోలాంటి షాకిచ్చేలా ప్లాన్ చేసినట్లుగా కనిపిస్తోంది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు ఇందులో భాగమనే చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఇది మరింత పెరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.