Begin typing your search above and press return to search.
మోడీ ఉబలాటం ఇందుకేనా?
By: Tupaki Desk | 7 Dec 2022 4:45 AM GMTప్రధాని నరేంద్రమోడీ రాజకీయాలను గమనిస్తే.. గత రెండు మూడు రోజులుగా ఆయన ఫోకస్ అంతా ఏపీ, తెలంగాణలపైనే ఉండడం గమనార్హం. నిన్న మొన్నటి వరకు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఫుల్‌బిజీగా గడిపిన మోడీ.. ఈ ఎన్నికలు అవడం ఆలస్యం ..
వెంటనే రెండు తెలుగు రాష్ట్రాలపైనా పడ్డారనే చర్చసాగుతోంది. ఇందులో కీలకమైంది.. ప్రస్తుతం రాజకీ యంగా చర్చకు వస్తున్న అంశం.. ఏపీ సీఎం జగన్‌ను ఆయన సోదరి, వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల విషయంలో మోడీ గద్దించారనే!
వాస్తవానికి లోపల ఏం జరిగిందో ఇతమిత్థంగా తెలియక పోయినా.. బయట జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. అన్న-చెల్లి మధ్య మోడీ జోక్యం పెరిగిందనే వాదనే వినిపిస్తోంది. వాస్తవానికి వైఎస్ కుటుంబంతో మోడీకి పెద్దగా టచ్ లేదు. జగన్ సీఎం అయిన తర్వాత.. లేదా.. ఆయన విపక్ష నేతగా ఉన్న సమయంలో కొద్దిపాటి పరిచయం ఉంది. సీఎం అయి, రాజ్యసభలో సహకరిస్తున్న నేపథ్యంలోనే మోడీ.. జగన్ తో చేతులు కలిపారనేది రాజకీయ వర్గాల మాట. ఇక, ఇప్పుడు షర్మిల అరెస్టు, ఆమెనుకారులో ఉంచే స్టేషన్‌కు తరలించడం వంటివాటిపై మోడీ చాలా ఉబలాటపడడం ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు పరిశీలకులు.
తెలంగాణ రాజకీయాల్లో ఉన్న షర్మిల విషయంలో జోక్యానికి ఏపీ సీఎంగా జగన్ నిరాకరిస్తున్న విషయం తెలిసిందే. అయితే, నువ్వు జోక్యం చేసుకోలేదా? అని మోడీ అడగడం వెనుక రాజకీయ వ్యూహం జగన్‌ను వాడుకుని.. కేసీఆర్ పై రెచ్చగొట్టడం ద్వారా ఏపీలో ఒకవిధమైన రాజకీయాలను సృష్టించాలనే పెద్ద స్కెచ్ ఉందనే చర్చసాగుతోంది. తద్వారా ఏపీపై తెలంగాణ, తెలంగాణపై ఏపీ రాజకీయ వివాదాలు సాగితే.. ఆ మంటల నుంచి సెగకాగుదామని భావిస్తున్నట్టుగా ఉందని చెబుతున్నారు.
ఇదిలావుంటే, తెలంగాణలో పాగా వేసేందుకు.. మోడీ షర్మిల అంశాన్ని వాడుకుంటున్నారనే మరో చర్చ కూడా ఏపీ వర్గాల్లో సాగుతోంది. అయితే, టీఆర్ ఎస్ ఆది నుంచి కూడా షర్మిల ఎంట్రీ వెనుక బీజేపీనే ఉందని చెబుతోంది.
ఇప్పుడు అటు కేంద్రం ఆమెకు ఫోన్‌చేసి అండగా ఉంటామని చెప్పడం.. ఇటు జగన్‌ను తలంటడం.. వంటివి చూస్తే ప్రధాని మోడీ ఉబలాటం.. రెండు రాష్ట్రాలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ఉందని అంటున్నారు పరిశీలకులు. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.