Begin typing your search above and press return to search.
రఘురామ రాజీనామా వెనుక.. వ్యూహం ఇదేనా...?
By: Tupaki Desk | 20 Jan 2022 5:55 AM GMTవైసీపీ నాయకుడు, నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు.. త్వరలోనే తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. అంతేకాదు.. ఈ సమయంలోనే ఆయన వైసీపీ నేతలకు గట్టి సవాలే రువ్వారు. అదేంటంటే.. నేను రాజీనామా చేసే లోగా.. మీరు నాపై.. అనర్హత వేటు వేయించాలి! అని!! అంతేకాదు.. తాను ఫిబ్రవరి 5న తన ఎంపీ పదవికి రిజైన్ చేస్తున్నట్టు చెప్పారు. అయితే .. ఈ క్రమంలో ఆయన వ్యూహాత్మకంగానే ఈ రాజీనామా ప్రతిపాదన తెరమీదికి తెచ్చారని అంటున్నారు వైసీపీ నాయకులు. ప్రస్తుతం తాజాగా పార్లమెంటులో జరిగిన పరిణామాలపై వైసీపీ నాయకులు చర్చ చేస్తున్నారు.
పార్లమెంటులో ఏం జరిగిందంటే.. ఇప్పటికే స్పీకర్‌కు చేరిన 8 అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు స్పీకర్ ఓం బిర్లా రెడీ అయ్యారు. అయితే.. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు ఉన్నందున అవి అయిపోగానే.. దీనిపై ఒక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధం గా ఉన్నారు. ఎందుకంటే.. బీజేపీకి మిత్రులుగా ఉన్న కొన్ని పార్టీల నుంచే ఈ అనర్హత పిటిషన్లు వచ్చాయి. దీంతో వీటిపై ఇప్పటి వరకు తాత్సారం చేసినా.. ఎన్నికలకు ముందు వీటిని పరిష్కరించకపోతే.. ఆయా పార్టీల నుంచి బీజేపీకి వ్యతిరేకత తప్పదు.
వీటిలో వైసీపీ ఎంపీ రఘురామ కు సంబంధించిన అంశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో అంటే.. మార్చి నాటికి ఖచ్చితంగా అనర్హత వేటు వేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే.. దాదాపు ఆరు సంవత్సరాల పాటు.. రఘురామ ఎన్నికల్లో పోటీకి అనర్హుడు అవుతాడు. అంటే.. ఏ ఎన్నికలోనూ ఆయన పోటీ చేసే అవకాశం లేదు. ఈ ఉద్దేశంతోనే వైసీపీ కూడా ఇప్పటి వరకు ఆయన పై ఎలాంటి పార్టీ పరంగా చర్యలు తీసుకోకుండా.. అనర్హత వేటు వేయించాలని చూస్తోంది.
ఈ విషయం.. అంటే.. పార్లమెంటులో జరుగుతున్న విషయాలను పసిగట్టిన రఘురామ.. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించాడని.. వైసీపీ ఎంపీలు చెబుతున్నారు. ఆయన రిజైన్ చేయాలంటే.. మరో రెండు నెలలు ఆగి చేయాలని.. అప్పుడు నమ్ముతామని అంటున్నారు.. లేదా.. ఇప్పటికే రిజైన్ చేసి ఉంటే నమ్మేవారమని అంటున్నారు. అలా కాకుండా.. కేవలం.. పార్లమెంటు పరిణామాలపై ఉప్పందుకుని ఇప్పుడు ప్రకటన చేయడం సరికాదని ఎద్దేవా చేస్తున్నారు.