Begin typing your search above and press return to search.
దేశంలో త్వరలో అందుబాటులోకి రానున్న మూడో వ్యాక్సిన్ అదేనా?
By: Tupaki Desk | 30 March 2021 8:00 PM ISTప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు రెండే. ఒకటి సీరం వారి కోవిషీల్డ్ అయితే.. రెండోది భారత్ బయోటెక్ కు చెందిన కోవాగ్జిన్. ఈ రెండు టీకాలకు తోడుగా మరో టీకాను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం ఓకే చెప్పనుందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ను త్వరలో కేంద్రం ఆమోదముద్ర వేస్తుందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఈ వ్యాక్సిన్ ను దేశీయంగా రెడ్డీస్ లాబొరేటరీస్ తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో కరోనా సెకండ్ వేవ్ షురూ అయిన వేళ.. దేశీయంగా మూడో వ్యాక్సిన్ అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది.
దేశంలో భారీ ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టటం ద్వారానే కరోనా వ్యాప్తిని నిరోధించే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా డాక్టర్ర రెడ్డీస్ ల్యాబ్స్ సీఈవో దీపక్ సప్రా మాట్లాడుతూ.. రాబోయే కొద్ది రోజుల్లోనే స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ను కేంద్రం ఆమోదిస్తుందని.. అందరికి అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఈ వ్యాక్సిన్ పరీక్షలకు సంబంధించిన వివరాలన్ని కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టినట్లు చెబుతున్నారు.
తాము చేపట్టిన ట్రయల్స్ డాటా ప్రస్తుతం ఇండియన్ రెగ్యులేటర్ వద్ద ఉందని.. రాబోయే కొద్ది వారాల్లోనే దీనికి ఆమోదముద్ర పడే వీలుందని చెబుతున్నారు. ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే.. దేశీయంగా టీకా కార్యక్రమం మరింత జోరుగా సాగేందుకు అవకాశం ఉంది.