Begin typing your search above and press return to search.

జలవివాదంపై సీఎం జగన్ ప్లానింగ్ ఇదేనా?

By:  Tupaki Desk   |   6 July 2021 4:30 AM GMT
జలవివాదంపై సీఎం జగన్ ప్లానింగ్ ఇదేనా?
X
విషయం ఏదైనా సరే.. తన చూపు ఒకసారి పడితే చాలు.. దాని అంతు చూసే వరకు వెనుకాడని ముఖ్యమంత్రుల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్టైల్ రోటీన్ కు భిననమైనదిగా చెబుతారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలజగడం నేపథ్యంలో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఈ ఇష్యూను తొలుత తెర మీదకు తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆరే. రాయలసీమ ప్రాజెక్టును అక్రమంగా కడుతున్నారంటూ ఆయన మొదలు పెట్టిన ప్రచారం.. తీసుకున్న చర్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

ఇదిలా ఉంటే.. ఏపీ తరఫున వాదనను వినిపిస్తూ.. తమకు న్యాయం చేయాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖలు రాశారు. ఈ లేఖలో రాయల సీమ లిఫ్ట్ కు త్వరగా పర్యావరణ అనుమతులు ఇవ్వాలని కోరిన వైనాన్ని తెలంగాణ తప్పు పడుతోంది. అంతేకాదు.. తాజాగా ఏపీ సర్కారు కేంద్రానికి రాసిన లేఖలోని పలు అంశాల్ని ప్రస్తావిస్తూ.. అందులోని లోపాల్ని ఎత్తి చూపించే ప్రయత్నం చేశారు. తన లేఖతోఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.. రాయలసీమ ప్రాజెక్టు అనుమతులు లేకుండానే నిర్మిస్తున్నామని పరోక్షంగా ఒప్పుకున్నట్లుగా తెలంగాణ సర్కారు వాదిస్తోంది.

నిబంధనలకు విరుద్ధంగా శ్రీశైలంతో పాటు నాగార్జునసాగర్.. పులిచింతల ప్రాజెక్టుల నుంచి తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా విద్యుదుత్పత్తిని చేస్తుందని మండిపడుతున్నారు. దీంతో కృష్ణా జలాలు వెస్ట్ గా సముంద్రంలోకి పోతున్నాయని ఆరోపిస్తూ కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కు ఒక లేఖ రాశారు. ఈ లేఖపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాల్ని వ్యక్తం చేస్తోంది. మొదటగా సీఎం జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖలో పేర్కొన్న కీలకాంశాలు.
- సాగర్‌ పరిధిలో ఎ లాంటి సాగు అవసరాలు లేకున్నా.. కేఆర్‌ఎంబీ నుంచి అనుమతి లేకున్నా విద్యుదుత్పత్తి చేస్తున్నది. పోతిరెడ్డిపాడు నుంచి గ్రావిటీ ద్వారా నీటిని వాడుకోవాలంటే 854 అడుగుల నీటిమట్టం ఉండాలి. కానీ, తెలంగాణ ఆ మట్టానికి నీళ్లు చేరుకోకుండా అడ్డుపడుతున్నది.

- పాలమూరు రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి ఎత్తిపోతలు, ఎస్‌ఎల్‌బీసీ పథకాలద్వారా రోజుకు 3 టీఎంసీల చొప్పున సు మారు 200 టీఎంసీలు వాడుకొనేలా తె లంగాణ ప్రణాళిక సిద్ధం చేసింది. జలవిద్యుదుత్పత్తికి 4 టీఎంసీలను వాడుకుంటున్నది. 800 అడుగుల దిగువ నుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని వాడుకొనేలా రాయలసీమ ఎత్తిపోతల తప్పితే ఏపీకి దిక్కులేదు.

- కేఆర్‌ఎంబీ పదేపదే ఆర్‌ఎల్‌ఐ ప్రదేశాన్ని పరిశీలించాలని ప్రతిపాదిస్తున్నాం.. తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులే అడ్వాన్స్‌డ్‌ స్టేజీలో ఉన్నాయి. ముందుగా వాటిని పరిశీలించాలి. దీంతోపాటు జల విద్యుదుత్పత్తిని అడ్డుకోవాలి. కేఆర్‌ఎంబీని తటస్థంగా ఉండేలా ఆదేశించాలి.

తెలంగాణ ప్రభుత్వ వాదన ఇది.

- కేంద్ర జల్‌శక్తి మంత్రికి రాసిన లేఖలో ముం దుగా తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులను పరిశీలించాలని జగన్‌ కోరడం వెనుక.. సీమ లిఫ్ట్‌ను నిర్మిస్తున్న ప్రదేశాన్ని పరిశీలించేందుకు రాకుండా అడ్డుకోవాలన్నదే ప్రయత్నం. ఎన్జీటీ ఆదేశాలను అమలు చేయనీయకుండా కేఆర్‌ఎంబీని తటస్థంగా ఉండేలా ఆదేశించమని కేంద్రమంత్రిని కోరడం విచిత్రంగా కాక మరేమైనా ఉందా?

- స్వతంత్ర సంస్థ అంటే ఒత్తిళ్లు లేకుండా పనిచేసే సంస్థ. కానీ ఏపీ సీఎం మాత్రం సీమ ఎత్తిపోతలకు ముందస్తుగా పర్యావరణ అనుమతి ఇచ్చేలా పర్యావరణ అంచనాల కమిటీని ఆదేశించాలంటూ కేంద్రమంత్రి జవదేకర్‌కు రాసిన లేఖలో కోరడం గమనార్హం. స్వతంత్ర సంస్థను ఆదేశించడమంటే.. ఆ సంస్థపై ఒత్తిడి పెంచి.. తమకు అనుకూలంగా, పూర్తిగా పరిశీలించకుండానే అనుమతులు ఇప్పించుకోవాలనే దురుద్దేశం కనపడుతున్నది.

- మోదీకి రాసిన లేఖలో శ్రీశైలం ప్రాజెక్టును జల విద్యుదుత్పత్తికి కోసమేనని ఒప్పుకోవడంతో వాస్తవాలు అందరికీ తెలిశాయి. మంత్రులకు రాసిన లేఖల ద్వారా.. ఏపీ రాయలసీమ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్టు, అందుకే ప్రాజెక్టు ప్రతిపాదిత ప్రదేశాన్ని నిపుణులు సందర్శించకుండా అడ్డుకుంటున్నట్టు తెలుస్తున్నది. స్వతంత్ర సంస్థల విధుల్లో రాజకీయంగా ఒత్తిడి తెచ్చి అక్రమంగా పర్యావరణ అనుమతులు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు బట్టబయలయింది.