Begin typing your search above and press return to search.
పవన్ కు కావాల్సింది ఇదేనా ?
By: Tupaki Desk | 3 Oct 2021 5:35 AM GMTజనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కావాల్సింది శ్రమదానం చేయటంకాదు. ప్రభుత్వంతో గొడవ పెట్టుకోవటం, ప్రచారం అందుకోవటమే ధ్యేయంగా శ్రమదానం కార్యక్రమం పెట్టుకున్నట్లుంది. లేకపోతే రాజమండ్రి నగరంలో పోలీసులతో గొడవ పెట్టుకునే వారే కాదు. రాజమండ్రిలోని బొమ్మూరు సెంటర్లో శ్రమదానం చేయాలని పవన్ డిసైడ్ చేసుకున్నారు. ఇందులో భాగంగానే శనివారం మధ్యాహ్నానికి రాజమండ్రికి చేరుకున్నారు. అయితే నగరంలోకి ప్రవేశించిన తర్వాత పవన్ ఉద్దేశ్యూపూర్వకంగానే పోలీసులతో గొడవలు పెట్టుకున్నారు.
నగరంలోకి ప్రవేశించటమే భారీ కాన్వాయ్ తో పవన్ ప్రవేశించారు. దీన్ని పోలీసులు అడ్డుకున్నారు. కరోనా వైరస్ కారణంగా ర్యాలీలను, ప్రదర్శనలను నిషేధించినట్లు ముందుగానే పోలీసులు పవన్ తో పాటు జనసేన నేతలకు స్పష్టం చేశారు. అయినా సరే ప్రభుత్వ ఆదేశాలను కాదని పెద్ద ఎత్తున కాన్వాయ్ లో ప్రదర్శనగా రాజమండ్రిలోకి పవన్ ప్రవేశించటం గమనార్హం. దాంతో ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. వెంటనే తన కాన్వాయ్ ను పవన్ రోడ్డు మధ్యలోనే నిలిపేసి వాహనంపైకి ఎక్కి పోలీసులపై నోటికొచ్చింది మాట్లాడారు.
తాను పోలీసు నిబంధనలను ఉల్లంఘించింది కాకుండా ఎదురు పోలీసులను బెదిరించటం, ఎంఎల్ఏలకు బుద్ధులు చెప్పమని ప్రభుత్వాన్ని ఎగతాళి చేయటం విచిత్రంగా ఉంది. వైసీపీ వాళ్ళకు ఎందుకింత అహకారం అంటు పిచ్చిపిచ్చిగా మాట్లాడారు. పైగా రాజకీయం తనకు సరదా కాదని ఒక బాధ్యతని చెప్పటమే విచిత్రంగా ఉంది. నిరసన తెలపటం ప్రజాస్వామ్యంలో ప్రజలకున్న హక్కుగా చెప్పారు.
పవన్ చెబుతున్న నిరసన ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదన్నఆలోచన కనబడలేదు. ఐదు రోజుల క్రితం పార్టీ నేతల విస్తృత స్ధాయి సమావేశంలో ప్రభుత్వాన్ని, వైసీపీ నేతలను హెచ్చరిస్తూ చెప్పిన మాటలనే మళ్ళీ రాజమండ్రిలో పదే పదే ప్రస్తావించారు. హోలు మొత్తం మీద చూస్తే అర్ధమవుతున్నదేమంటే అధికార పార్టీని, జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయటమే అసలు లక్ష్యంగా అర్ధమవుతోంది. ఇంతోటి దానికి శ్రమ దానమని ఇంకోటని ప్రచారం చేసుకోవాల్సిన అవసరమే లేదు.
గతుకులు లేని రోడ్డు రాష్ట్రంలో ఒక్కటైనా ఉందా అని ప్రశ్నించటమే విచిత్రంగా ఉంది. గతుకులు లేని రోడ్లు మనదేశంలో ఊహించగలమా ? అధికారంలో ఉన్నది ఎవరన్న దాంతో నిమ్మతం లేకుండా ఏ ప్రభుత్వంలో అయినా రోడ్ల పరిస్ధితి దాదాపు ఇలాగే ఉంటుందన్నది వాస్తవం. అయినా ఒకవైపు భారీ వర్షాలు కురుస్తున్న సమయంలోనే రోడ్లు మరమ్మతులు వేయాలని డిమాండ్ చేయడం పవన్ కే చెల్లింది. ఐదురోజుల క్రితం పార్టీ నేతల సమావేశంలో మాట్లాడిన మాటలు, చేసిన ఆరోపణలనే తాజాగా రాజమండ్రిలో రిపీట్ చేయడం గమనార్హం.