Begin typing your search above and press return to search.
ఇందుకే టీడీపీ జనాల్లో చీపైపోతోందా ?
By: Tupaki Desk | 11 Nov 2020 7:50 AM GMTఒక పార్టీకి జనాల్లో ఇమేజి పెరగాలంటే చెప్పేది, చేసేది ఒకటిగానే ఉండాలి. అప్పుడే పార్టీ అధినేత మాటలకు జనాల్లో విలువుంటుంది. అధికారంలో ఉన్నపుడు ఏమి చేసిందనేది వదిలేసినా ప్రతిపక్షంలోకి వచ్చిన దగ్గర నుండి టీడీపీ అనుసరిస్తున్న విధానం వల్ల జనాల్లో పలుచనైపోతోంది. ఇందుకు తాజా ఉదాహరణగా ఓ ఘటనను చెప్పుకోవాలి. కర్నూలులో ఈ మధ్యనే ఓ కుటుంబం సామూహికంగా ఆత్మహత్యలు చేసుకున్నది. ఘటన వెలుగు చూడగానే రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. దీనిపై ప్రభుత్వం కూడా చాలా సీరియస్ అయ్యి పోలీసు ఉన్నతాధికారులతో విచారణ చేయిస్తోంది.
తమ ఆత్మహత్యలకు పోలీసుల వేధింపులే కారణమని కుటుంబం ఓ వీడియో పోస్టు చేయటంతో అందుకు బాధ్యత గా పోలీసు ఇన్ స్పెక్టర్ తో పాటు కానిస్టేబుల్ ను కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసి అరెస్టు కూడా చేసింది. ఇక్కడ వరకు ప్రభుత్వం తన బాధ్యతను తాను సక్రమంగానే నిర్వర్తించింది. పోలీసులను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. దాంతో కోర్టులో నిందితులందరు బెయిల్ తీసుకుని బయటకు వచ్చేశారు. బెయిల్ తీసుకోవటం అన్నది నిందితులకున్న హక్కు. న్యాయమూర్తి కన్వీన్స్ అయితే బెయిల్ ఇస్తారన్న విషయం అందరికీ తెలిసిందే.
అసలు సమస్యంతా ఇక్కడే మొదలైంది. పోలీసులను అరెస్టు చేసినట్లే చేసి ఇలా బెయిల్ ఇచ్చేశారంటూ టీడీపీకి మద్దతుగా ఉండే మీడియా గోల మొదలుపెట్టింది. దాని ఆధారంగా చంద్రబాబునాయుడు, లోకేష్ నుండి ప్రతి టీడీపీ నేత ప్రభుత్వంపై విరుచుకుపడిపోతున్నారు. ఇక్కడ ప్రభుత్వం చేసిన తప్పేమీ లేకపోయినా టీడీపీ మాత్రం ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంది.
అయితే నిందితులకు బెయిల్ వచ్చిన విషయాన్ని కాస్త లోతుగా పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వచ్చాయి. అవేమిటయ్యా అంటే నిందితులకు బెయిల్ ఇప్పించిందే టీడీపీ నేత. నంద్యాలకు చెందిన వెదుర్ల రామచంద్రరావు అనే టీడీపీ నేత లాయర్ కూడా. పైగా వెదుర్లను రాష్ట్ర కమిటిలో కార్యదర్శిగా ఈమధ్యనే చంద్రబాబు నియమించారు. అంటే ప్రభుత్వంపై బురద చల్లుతున్నది చంద్రబాబు, అచ్చెన్నాయుడు, టీడీపీ నేతలే. నిందితులకు బెయిల్ ఇప్పించిందీ టీడీపీ నేతే.
తమ పార్టీ కార్యదర్శే నిందితులకు బెయిల్ ఇప్పించినపుడు చంద్రబాబు ఎందుకు అడ్డుకోలేదు ? బాధితులకు కచ్చితంగా శిక్ష పడాలని అనుకున్నపుడు తమ పార్టీ నేతే వాళ్ళకి లాయర్ రూపంలో ఎలా బెయిల్ ఇప్పించారో అడగలేరా ? పోనీ తమ నేతే నిందితులకు బెయిల్ ఇప్పించినపుడు చంద్రబాబు కానీ మరెవరు కానీ ఆ విషయాన్ని ప్రస్తావించకూడదు. నిందితులకు లాయర్ అయిన టీడీపీ నేతే బెయిల్ ఇఫ్పించిన విషయం బయటపడిపోయింది. దాంతో ఇపుడీ విషయంతో తమకేమీ సంబంధం లేనట్లు అధినేత వ్యవహరిస్తున్నారు. ఇటువంటి డబుల్ స్టాండర్డ్ వల్లే టీడీపీ జనాల్లో పలుచనైపోతోంది.