Begin typing your search above and press return to search.
తిరుపతి నుంచి శ్రీశైలం వరకు వైసీపీ ఎమ్మెల్యే పాదయాత్ర అందుకేనా?
By: Tupaki Desk | 25 Nov 2022 6:30 AM GMTతూర్పుగోదావరి జిల్లా కొత్తపేట వైసీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి వినూత్న నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ ఆయన పాదయాత్ర చేపట్టారు. తిరుపతి నుంచి శ్రీశైలం వరకు పాదయాత్ర చేయనున్నారు.
నవంబర్ 27న మొదలయ్యే యాత్ర కోసం చిర్ల జగ్గిరెడ్డి తిరుపతికి బయలుదేరి వెళుతున్నారు. తిరుపతి నుంచి శ్రీశైలం వరకు పాదయాత్ర చేస్తారు. మరోసారి జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని ఆయా దేవుళ్లను ఎమ్మెల్యే జగ్గిరెడ్డి కోరనున్నారు.
కాగా వాస్తవానికి చిర్ల జగ్గిరెడ్డి అనుచరుడు రావులపాలెం నుంచి తిరుపతి–శ్రీశైలం పాదయాత్రను రెండేళ్ల క్రితం చేపట్టారు. సీఎం జగన్ మరోమారు ముఖ్యమంత్రి కావాలని, అలాగే చిర్ల జగ్గిరెడ్డి మరోసారి ఎమ్మెల్యేగా గెలవాలని ఆకాంక్షిస్తూ ఎమ్మెల్యే అనుచరుడు మల్లిడి యువ రామప్రసాద్‌రెడ్డి పాదయాత్రను చేపట్టారు. అయితే ఆయన రావులపాలెం నుంచి తిరుపతి వరకు చేరుకున్నాక మృతి చెందారు.
దీంతో తన అనుచరుడు మల్లిడి యువరామప్రసాద్‌రెడ్డి సగంలో ముగించిన యాత్రను ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పూర్తి చేయాలని సంకల్పించారు. తిరుపతిలో ఆగిపోయిన మొక్కును ఆయన చెల్లించనున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి నుంచి శ్రీశైలం వరకు పాదయాత్ర చేయనున్నారు.
కాగా చిర్ల జగ్గిరెడ్డి తొలిసారిగా 2004లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి బండారు సత్యానందరావు చేతిలో ఓటమిపాలయ్యారు. 2014లో కేవలం 712 ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థిగా గెలుపొందారు. 2019లోనూ వైసీపీ అభ్యర్థిగా కొత్తపేట నుంచి విజయం సాధించారు. ఇప్పటివరకు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చిర్ల జగ్గిరెడ్డి వచ్చే ఎన్నికల్లోనూ గెలుపొందడానికి ప్రయత్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తిరుపతి నుంచి శ్రీశైలం వరకు పాదయాత్ర చేపట్టారు. జగన్‌ను మరోసారి సీఎంగా, తనను మరోసారి ఎమ్మెల్యేగా చేయాలని దేవుడిని కోరుకోనున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.