Begin typing your search above and press return to search.
టీఆర్ఎస్ ఎందుకిలా చేస్తోంది?
By: Tupaki Desk | 11 Feb 2022 4:07 AM GMTఒక చిన్న విషయాన్ని పట్టుకుని అందులో తనకు ఎలాంటి సంబంధం లేని విషయాన్ని పట్టుకుని టీఆర్ఎస్ బాగా లాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. పార్లమెంట్ సెక్రటరీ జనరల్ కు టీఆర్ఎస్ లోక్ సభ సభ్యులు నోటీసిచ్చారు. సరే వీళ్ళిచ్చిన నోటీసుతో ఏదో అయిపోతుందని ఎవరు అనుకోవటం లేదు. ఆ విషయం టీఆర్ఎస్ జనాలకు కూడా బాగా తెలుసు. కాకపోతే ప్రధానిమంత్రిపైనే సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చామని చెప్పుకోవటానికి మాత్రమే పనికొస్తుంది.
అయితే ఇక్కడే చాలామందికి ఒక విషయం అర్ధం కావటం లేదు. మూడు రోజుల క్రితం నరేంద్ర మోడీ పార్లమెంటులో మాట్లాడుతూ 2014లో జరిగిన రాష్ట్ర విభజన గురించి మాట్లాడారు. విభజననను కాంగ్రెస్ పార్టీ అడ్డుగోలుగా చేసిందన్నారు. శాస్త్రీయ పద్ధతిలో విభజన జరగని కారణంగా ఏపీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. విభజన బిల్లును పార్లమెంటులో పెట్టినపుడు తలుపులు వేసేసి, లైవ్ రిలే కట్ చేసి, మైకులు కట్ చేసి బిల్లు పాసైందని ప్రకటించారని చెప్పారు.
మోడీ చెప్పిందానిలో చాలా వరకు నిజాలే ఉన్నాయి. మోడీ టార్గెట్ అంతా కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అందుకనే కాంగ్రెస్ పార్టీని దుమ్ము దులిపేశారు. మధ్య మధ్యలో తాము ప్రత్యేక తెలంగాణాకు వ్యతిరేకం కాదని కూడా చెప్పారు. సీన్ కట్ చేస్తే మూడు రోజుల నుంచి మోడిపై మంత్రులు, టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఒకటే గోల చేస్తున్నారు. నానా తిట్లు తిడుతున్నారు. మోడీని తెలంగాణా వ్యతిరేకని, తెలంగాణా ప్రజల మనోభావాలను దెబ్బ తీశారని, తెలంగాణా ప్రజలను అవమానించారంటు గోల గోల చేస్తున్నారు.
మోడీ స్పీచ్ లో అసలు టీఆర్ఎస్ గురించి కానీ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కానీ ఒక్క ముక్క కూడా లేదు. మరిందులో తెలంగాణాను, తెలంగాణా ప్రజలను అవమానించిందెక్కడ ? మోడీ అనని మాటలను అన్నట్లుగా మంత్రులు ఎందుకు ప్రచారం చేస్తున్నారో అర్థం కావటం లేదు. తెలంగాణ ప్రయోజనాలను మోడీ సర్కార్ దెబ్బ కొడుతోందని ఆరోపిస్తే అది వేరే విధంగా ఉండేది.
2014 నుండి రాజమండ్రి పార్లమెంటు మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ నెత్తీ నోరు మొత్తుకుంటుని చెబుతున్నది ఇపుడు మోడీ చెప్పారంతే. తెలంగాణాకు కేంద్రం అన్యాయం చేస్తోందని చెప్పటం మానేసి పార్లమెంటునే అవమానించారంటు మోడీకి వ్యతిరేకంగా సభా హక్కుల ఉల్లంఘన నోటీసివ్వటమే విచిత్రంగా ఉంది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేసింది చాలదన్నట్లు గురువారం లోక్ సభలో హక్కుల నోటీసిచ్చారు. చూస్తుంటే టీఆర్ఎస్ చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నట్లే ఉంది.