Begin typing your search above and press return to search.

మోదీకి ట్రంప్ క్లాస్ పీకాడా? ప్రసంగంలో పరోక్ష వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   25 Feb 2020 5:30 PM GMT
మోదీకి ట్రంప్ క్లాస్ పీకాడా? ప్రసంగంలో పరోక్ష వ్యాఖ్యలు
X
మిత్రుడిగా ఆహ్వానిస్తుంటే ఎల్లప్పుడూ భారత్ ను శత్రు దేశంగా పాకిస్తాన్ భావిస్తోంది. ఎప్పుడు భారత్ పై అక్కసు వెల్లగక్కుతూ అంతర్జాతీయ స్థాయిలో పరాభవం ఎదుర్కొంటోంది. అయితే ఈ దేశానికి పరోక్షంగా అమెరికా, ప్రత్యక్షంగా చైనాలు అండగా నిలుస్తున్నాయి. వీటిన్నిటి నేపథ్యంలో భారతదేశంలో అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ రెండు రోజుల పాటు పర్యటించారు. ఈ సందర్భంగా తొలిరోజు సోమవారం గుజరాత్ లోని అహ్మదాబాద్ లో పర్యటించారు. ఈ సందర్భంగా మొతెర స్టేడియం లో ఏర్పాటు చేసిన సమావేశం లో నరేంద్ర మోదీ ప్రసంగం అనంతరం ట్రంప్ మాట్లాడారు.

ఈ సందర్భంగా ప్రసంగంలో ట్రంప్ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. చాయ్ వాల నుంచి ప్రధానమంత్రి అయ్యాడని గుర్తుచేసి ఆకట్టుకున్నారు. భారతదేశం గొప్పతనం వివరిస్తూనే పరోక్షంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసిన పలు నిర్ణయాలపై ప్రస్తావించారు. అయితే ఇటీవల దేశంలో పౌరసత్వ సవరణ చట్టం తీసుకురావడంతో ముస్లింలకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనిపై పరోక్షంగా ప్రస్తావించినట్టు ట్రంప్ ప్రసంగం తీరు పరిశీలిస్తే తెలుస్తోంది. భారతదేశం హిందూ, ముస్లిం, సిక్కు తదితర కలిసి జీవిస్తున్నారని భిన్నత్వంలో ఏకత్వం అని తెలిపారు. అంటే ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదని, సీఏఏతో ముస్లింలకు వ్యతిరేకంగా మారిందని చెప్పకనే చెప్పారు. దీంతో పాటు మోదీ మొండిఘట్టమని పొగడడం వెనక సీఏఏ, త్రిబుల్ తలాక్ చట్టం పట్టుబట్టి తీసుకు రావడాన్ని గుర్తు చేసింది.

అమెరికాలో ఆయన తీసుకుంటున్న వీసా నిబంధనలను సమర్ధించుకున్నట్లు ట్రంప్ వ్యవహారం కనిపించింది. అయితే ట్రంప్ ప్రసంగం ఆసాంతం పరిశీలించగా ఎక్కడా పాకిస్తాన్ పేరు ప్రస్తావించ లేదు. భారత్ కు పక్కలో బల్లెంలా ఉన్న పాకిస్తాన్ లో ఉగ్రవాదం పెరిగి పోతున్నా ఆ దేశానికి పరోక్షం గా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. పాకిస్తాన్ కు అండగా ఉంటున్నట్లు మరోమారు నిరూపితమవుతోంది. భారత్ అమెరికాతో సత్సబంధాలు కోరుతోందని ప్రధానంగా నరేంద్రమోదీ చాటిచెప్పారు. ట్రంప్ కూడా ఇదే అభిప్రాయాన్ని తెలిపారు. దీని ద్వారా పక్కనే ఉన్న చైనా, పాకిస్తాన్ కు పరోక్ష సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. ట్రంప్ భారత్ పర్యటనను చైనా, పాకిస్తాన్ లు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఈ పర్యటనతో రెండు దేశాల మధ్య బలోపేతం అయ్యింది. అయితే భవిష్యత్ లో అంతర్జాతీయం గా ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.