Begin typing your search above and press return to search.

ఐఫోన్ లో అది లేదు.. ట్రంప్ అసంతృప్తి

By:  Tupaki Desk   |   27 Oct 2019 6:35 AM GMT
ఐఫోన్ లో అది లేదు.. ట్రంప్ అసంతృప్తి
X
ఐఫోన్.. ప్రపంచంలోనే నంబర్ 1 ఫోన్. యాపిల్ సంస్థ తయారు చేసే ఈ ఫోన్ ఖరీదు దాదాపు లక్షకు దగ్గరగానే ఉంటుంది. ఎంతో మంది సెలెబ్రేటీలు, పారిశ్రామికవేత్తలు, దేశాధినేతలు కూడా వాడే ఈ ఫోన్ ప్రపంచంలోనే అత్యంత హైఎండ్ టెక్నాలజీ గలది. సామన్యులు సైతం ఈ ఫోన్ ను కొంటూ వాడేస్తున్నారు. స్టేటస్ సింబల్ గా ప్రస్తుతం ఐఫోన్ మారిపోయింది.

అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఐఫోన్ వాడుతున్నారని తెలిసింది. ఐఫోన్ కొత్త మోడల్ ఫోన్ మార్కెట్లోకి ఇటీవలే విడుదలైంది. దీన్ని ట్రంప్ కు అమెరికా ప్రభుత్వం అందజేసింది. చూడగానే చిరాకు ఎత్తినట్టుంది. ఆ ఐఫోన్ కొత్త మోడల్ లో హోమ్ బటన్ లేకపోవడంతో ట్రంప్ కు కోపం కట్టలు తెచ్చుకుంది. దీంతో వెంటనే ఆయన ట్విట్టర్ లో తన అసంతృప్తిని వెళ్లగక్కారు. యాపిల్ సీఈవో టిమ్ కుక్ కు సలహాలు ఇస్తూ ట్వీట్ చేశారు.

ట్రంప్ ట్వీట్ చేస్తూ ‘టిమ్ కుక్.. ఐఫోన్ లో స్వైప్ కంటే బటనే చాలా బాగుంది. హోం బటన్ ఐఫోన్లలో ఉంచాల్సిందే’ అంటూ ట్వీట్ చేశారు.

2007 నుంచి ఐఫోన్ లో హోమ్ బటన్ ఉంటూ వస్తోంది. అయితే రెండేళ్ల క్రితం ఐఫోన్ తన డిజైన్ లో మార్పులు చేసింది. తాజాగా 2017 నుంచి వస్తున్న ఐఫోన్ 10 మోడల్ నుంచి హోం బటన్ ను తొలగించింది. దీంతో హోం స్క్రీన్ కు రావాలంటే యూజర్ ప్రతీసారి స్క్రీన్ స్వైప్ చేయాల్సి వస్తోంది. ఈ మార్పు సాధారణ కస్టమర్లకే కాదు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కూడా ఇబ్బంది కలిగించింది. అందుకే ఐఫోన్ లేటెస్ట్ మోడల్ తన చేతికి అందగా దానిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ యాపిల్ సీఈవో టిమ్ కుక్ కు హోంబటన్ తీసివేయడం బాగా లేదంటే ట్రంప్ ట్వీట్ చేశాడు. మరిని దీనికి యాపిల్ , టిమ్ కుక్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.