Begin typing your search above and press return to search.

గులాబీలో కొత్త గుబులు... పార్టీకి మైన‌స్సేనా...!

By:  Tupaki Desk   |   10 Aug 2019 6:55 AM GMT
గులాబీలో కొత్త గుబులు... పార్టీకి మైన‌స్సేనా...!
X
రాజకీయ నాయకుడికి మైక్ కనిపిస్తే చాలు పూనకం వచ్చినట్లు ప్రసంగాలు చేసేస్తాడనే విషయం అందరికీ తెలిసిందే. తమ పార్టీని పొగుడుతూ, అపోజిషన్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేస్తాడు. కాకపోతే ఇక్కడ వార్ వన్ సైడ్ అన్నట్లు ఉంటుంది. అయితే నాలుగైదు పార్టీల ప్రతినిధులు ఒకేచోట కలిసి కూర్చునే టీవీ చర్చ కార్యక్రమాలు మాత్రం మంచి హాట్ గా ఉంటాయి. ఏ విమర్శ చేసిన పక్కనే అపోజిషన్ పార్టీ నాయకుడు కూడా ఉంటాడు..ఆ మాటలకు వెంటనే కౌంటర్ వచ్చేస్తుంది. దానివల్ల ఆ కార్యక్రమం రసవత్తరంగా జరుగుతుంది.

అయితే టీవీ కార్యక్రమాల్లో పాల్గొనే ప్రతినిధులు వల్ల పార్టీకి ఒకోసారి లాభం కలిగిన...ఒకోసారి నష్టం కూడా కలగొచ్చు. ప్రస్తుతం చాలా న్యూస్ ఛానల్స్ ఉండటం వల్ల పార్టీ ప్రతినిధులు ఒక్కొక్కరు ఒక్కో ఛానల్ కి వెళతారు. అయితే వీరు ఏదైనా ఒక పాయింట్ గురించి మాట్లాడాల్సి వస్తే ఒక్కొక్కరు ఒక్కో వెర్షన్ లో చెబుతారు. దీంతో పార్టీకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఇలాంటి ఇబ్బందులు ఉండకూడదనే తెలంగాణలో అధికార టీఆర్ ఎస్ పార్టీ..తమ ప్రతినిధులు టీవీ చర్చ కార్యక్రమాలకి వెళ్లడానికి వీలులేదని ఆంక్షలు పెట్టింది. దీంతో మీడియాలో టీఆర్ఎస్ ప్రతినిధులు కనపడట్లేదు.

టీవీల్లో తెలంగాణకి చెందిన ఏమైనా చర్చ జరిగితే కాంగ్రెస్, బీజేపీ ప్రతినిధులు ఓ రాజకీయ విశ్లేషుకుడు మాత్రమే కనిపిస్తున్నారు. అయితే టీఆర్ఎస్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మరొక నష్టం కూడా ఉంది. చర్చల్లో అధికార పక్షం తీసుకున్న నిర్ణయాలు మీదే ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది. అలాంటి తరుణంలో ప్రతిపక్షాలు విమర్శలు చేస్తే , ప్రభుత్వం తరుపున వాటిని తిప్పేకొట్టేవారు ఉండరు. దాని వల్ల పార్టీకి ఎక్కువ మైనస్ అవుతుంది. పైగా ఫామ్ లో ఉన్న రాజకీయ పార్టీలు లేకపోతే ఆ చర్చా కార్యక్రమం చప్పగా సాగుతుంది.

ఇక ఈ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకున్న గులాబీ పార్టీ త్వరలో చర్చల్లో పాల్గొనేందుకు 30మంది అధికార ప్రతినిధులని ఎంపిక చేసి ప్రక్రియ చేపట్టనుందని తెలుస్తోంది. వీరిని ఓ టీంగా ఏర్పాటు చేసి తగు జాగ్రత్తలు చెప్పి చర్చలకు పంపేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే అధికార ప్రతినిధులు ఎంపికయ్యేవరకు గులాబీ ప్రతినిధులు చర్చల్లో పాల్గొనే అవకాశం లేదు. మరి చూడాలి కేసీఆర్ పార్టీ దీనిమీద ఎలాంటి కసరత్తు చేస్తుందో.