Begin typing your search above and press return to search.
18 ఏళ్ళవాళ్ళకి టీకాలు సాధ్యమేనా ?
By: Tupaki Desk | 30 April 2021 1:00 PM ISTకేంద్రప్రభుత్వం చెబుతున్నట్లుగా 18 ఏళ్ళు దాటిన వారందరికీ టీకాలు ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేదు. ఏదో నోటికొచ్చిన ప్రకటన చేసేసిన కేంద్రం ఆచరణలో మాత్రం చేతులు దులిపేసుకుంది. తాము చేసిన ప్రకటన అసలు ఆచరణ సాధ్యమేనా ? కాదా ? అన్న విషయాన్ని గురించి ఏమాత్రం ఆలోచించలేదని అర్ధమవుతోంది. ఎందుకంటే కేంద్రం ప్రకటింనట్లు 18 ఏళ్ళవాళ్ళకి కూడా టీకాలు వేయాలంటే కనీసం 70 కోట్లమంది అర్హత సాధిస్తారు.
అంటే వీళ్ళందరికీ 140 కోట్ల డోసులు అవసరం. 45-60 ఏళ్ళ వాళ్ళకే ఇపుడు రెండు డోసులు వేయలేక కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చేతులెత్తేశాయి. ఇప్పటికి టీకాలు వేయించుకున్న వారి సంఖ్య 15 కోట్లు మాత్రమే. వీళ్ళల్లో కూడా రెండు డోసులు వేయించుకున్న వారి సంఖ్య కేవలం 2.5 కోట్లు మాత్రమే. అంటే మిగిలిన 12.5 కోట్లమంది రెండో డోసు వేయించుకోలేదు. వీరిలో అత్యధికులకు రెండో డోసు వేయటానికి వ్యాక్సిన్లు అందుబాటులో లేవు.
రెండో డోసు వేయించుకోవాల్సిన వాళ్ళకే సరిపడ టీకాలు లేకపోతే ఇక 18 ఏళ్ళు నిండినవారికి అవసరమైన 140 కోట్ల టీకాలను ఎక్కడి నుండి తెస్తారు ? సీరం సంస్ధ కోవీషీల్డ్ టీకాలను నెలకు 7 కోట్లు మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతోంది. రాబోయే జూలై నుండి నెలకు 10 కోట్ల టీకాలను ఉత్పత్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది. ఇదే సమయంలో జూలైం నుండి 7 కోట్ల కోవాగ్జిన్ టీకాలను ఉత్పత్తి చేయాలని భారత్ బయోటెక్ యాజమాన్యం టార్గెట్ గా పెట్టుకుంది.
అంటే ఇప్పటి అవసరాల్లో కనీసం సగం టీకాలను కూడా రెండు కంపెనీలు కలిసి ఉత్పత్తి చేయలేకపోతున్నాయి. వాస్తవం ఇలాగుంటే 18 ఏళ్ళ దాటిన వాళ్ళకు కూడా టీకాలంటు కేంద్రం చేసిన ప్రకటన పూర్తిగా డ్రామానే తలపిస్తోంది. టీకాల ఉత్పత్తి విషయాన్ని ఫార్మా కంపెనీలతో మాట్లాడుకుని వాస్తవ అవసరాలను లెక్కేసుంటే కేంద్రం ఇలాంటి ప్రకటన చేసేదికాదు. రష్యా తయీరా స్పుత్నిక్, ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీలు టీకాల ఉత్పత్తికి ముందుకొస్తే అప్పట్లో కేంద్రం అనుమతించలేదు.
సమస్యలు ఒక్కసారిగా పెరిగిపోయి రెండు ఫార్మా కంపెనీలు డిమాండ్లను తట్టుకోలేవని అర్ధమైన తర్వాతే విదేశీ కంపెనీలతో కేంద్రం మాట్లాడ్డం మొదలైంది. ఇపుడు విదేశీ కంపెనీలు వచ్చినా టీకాలు ఉత్పత్తి చేసి సరఫరా చేయటానికి నెలలు పడుతుంది. క్షేత్రస్ధాయిలో వాస్తవాలను గమనించిన రాష్ట్రప్రభుత్వాలే 18 ఏళ్ళవాళ్ళకి టీకాల విషయంలో నిజాలు చెప్పేస్తున్నాయి. సీఎంలు చెబుతున్నట్లుగా వచ్చే ఫిబ్రవరి, మార్చిలో కానీ 18 ఏళ్ళవాళ్ళకు టీకాలు మొదలుపెట్టలేరు. అప్పటివరకు ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళుండక తప్పదంతే.