Begin typing your search above and press return to search.
కిషన్ రెడ్డితో సమావేశం అయిన టీడీపీ ఎమ్మెల్యే!
By: Tupaki Desk | 8 July 2019 8:50 AM GMTఒకవైపు తమతో పద్దెనిమిది మంది టీడీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ భారతీయ జనతా పార్టీ హడావుడి ప్రకటనలు చేస్తూ ఉంది. టీడీపీ తరఫున నెగ్గిందే ఇరవై మూడు మంది అయితే వారిలో ఐదు మంది మినహాయించి అందరూ తమతో టచ్ లో ఉన్నట్టుగా బీజేపీ చెబుతూ ఉంది. ఈ ప్రకటనపై చర్చ జరుగుతూ ఉండగానే.. టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ వెళ్లి కిషన్ రెడ్డితో సమావేశం కావడం ఒకింత సంచలనంగా మారింది.
ప్రస్తుతం ఆన్ లైన్ లో అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి. కిషన్ రెడ్డి ముందు సోఫాలో వంశీమోహన్ కూర్చుని ఉండగా - పక్కనే ఏపీ బీజేపీ నేత మాణిక్యాల రావు కూడా కనిపిస్తారు. ఈ ఫొటో తెలుగుదేశం అభిమానులను ఇబ్బంది పెట్టేదే అవుతోంది.
బీజేపీతో టచ్లో ఉన్న ఎమ్మెల్యేల్లో వల్లభనేని వంశీ మోహన్ కూడా ఒకరా అనే చర్చకు ఆస్కారం ఇస్తోంది ఈ ఫొటో. అయితే దీని వెనుక వేరే కథ ఉంది. ఏపీలో స్వర్ణ భారతి ట్రస్టు కార్యక్రమానికి కిషన్ రెడ్డి హాజరు అయ్యారు. ఆ కార్యక్రమానికి ఇతర బీజేపీ నేతలూ వచ్చారు. అలాగే వల్లభనేని వంశీ మోహన్ కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు.
స్వర్ణభారతి ట్రస్టు ఎవరిదో చెప్పనక్కర్లేదు. వైఎస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు కుటుంబానికి సంబంధించిన సంస్థ అది. దాని ఆధ్వర్యంలో కార్యక్రమం కావడంతో కిషన్ రెడ్డి వెళ్లారు. వెంకయ్య సంతానంతో వల్లభనేని వంశీ మోహన్ కు సాన్నిహిత్యంతో ఆ కార్యక్రమానికి వెళ్లినట్టుగా తెలుస్తోంది.
కేవలం మర్యాదపూర్వకంగానే కిషన్ రెడ్డితో వల్లభనేని వంశీ మోహన్ సమావేశం అయినట్టుగా తెలుస్తోంది. కానీ ప్రస్తుతం బీజేపీ - టీడీపీల మధ్యన సాగుతున్న వర్బల్ వార్ నేపథ్యంలో.. ఈ ఫొటో కూడా బోలెడంత చర్చకు ఆస్కారం ఇస్తోంది.