Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ 'వైశ్రాయ్' ఘ‌ట‌న‌.. ఈ సారి జ‌గ‌న్ కోసం..?

By:  Tupaki Desk   |   26 Sep 2022 5:30 PM GMT
మ‌ళ్లీ వైశ్రాయ్ ఘ‌ట‌న‌.. ఈ సారి జ‌గ‌న్ కోసం..?
X
టీడీపీలో మ‌రోసారి వైశ్రాయ్ ఘ‌ట‌న జ‌ర‌గ‌నుందా? ఆదిశ‌గా.. అంత‌ర్గ‌త చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయా? జ‌గ‌న్ వైఖ‌రితో విసుగుచెందిన ఎమ్మెల్యేలు.. భారీ సంఖ్య‌లో వ‌చ్చేసేందుకు.. రెడీ అవుతున్నారా? ఆయ‌న‌ను అధికారం నుంచి దింపేందుకు సొంత సామాజిక వ‌ర్గ‌మే.. సిద్ధంగా ఉందా? అంటే.. ఔన‌నే అంటున్నారు టీడీపీ నాయ‌కులు. తాజాగా మాజీ మంత్రి దేవినేని ఉమా.. చేసిన వ్యాఖ్య‌లు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. సంచ‌ల‌నంగా మారాయి.

దాదాపు 80 మంది వైసీపీ ఎమ్మెల్యేలు.. తీవ్ర‌స్థాయిలో అసంతృప్తితో ఉన్నార‌ని.. వారిలో రెడ్డి వ‌ర్గం మ‌రీ అసంతృప్తితో ఉంద‌ని.. వీరంతా కూడా..బ‌య‌ట‌కు వ‌చ్చేసి.. ప్ర‌భుత్వాన్ని కూల్చేసే అవ‌కాశం ఉంద‌ని లెక్క‌లు వేస్తున్నారు. ఇప్ప‌టికే.. కొంద‌రు హైద‌రాబాద్‌లో మ‌కాం వేసి మ‌రీ.. జంప్ చేయ‌డ‌మా.. స‌ర్కారును కూల్చేయ‌డ‌మా? అనే చ‌ర్చ చేస్తున్న‌ట్టు.. కొన్నాళ్లుగా.. తెలంగాణ‌లోనూ..చ‌ర్చ న‌డుస్తున్న‌ట్టు దేవినేని ఉమా వ్యాఖ్యానించారు.

అంటే.. దీనిని బ‌ట్టి.. ఏపీలో మ‌రో వైశ్రాయ్ ఘ‌ట‌న తెర‌మీదికివ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని.. ప‌రిశీల‌కులు చెబుతున్నారు. గ‌తంలో అన్న‌గారు ఎన్టీఆర్ ఓ ప్ర‌లోభానికి చిక్కుకుని.. పాల‌న‌ను గాడి త‌ప్పిస్తున్న స‌మ‌యంలో.. చోటు చేసుకున్న వైశ్రాయ్ ఘ‌ట‌న‌.. అంద‌రినీ ఆక‌ర్షించింది.

అన్న‌గారికి వ్య‌తిరేకంగా.. టీడీపీ ఎమ్మెల్యేలు.. ఒక‌చోటకు చేరి.. జ‌ట్టు క‌ట్టిన విష‌యం తెలిసిందే. ఇక ఇప్పుడు వైసీపీలోనూ.. ఇదే ప‌రిస్థితి వ‌స్తుంద‌ని.. ఉమా చెబుతున్నారు.

అయితే.. ఎవ‌రు ఈ అస‌మ్మ‌తిని ముందుకు తీసుకువెళ్తారు? అనేదే ఇప్పుడు.. రెడ్డి సామాజిక వ‌ర్గం ఆలోచ‌న‌గా ఉంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతానికి అయితే.. రెడ్డి వ‌ర్గం తీవ్ర అసంతృప్తితో ఉంద‌నేది వాస్త‌వం.

వారికి ప‌ద‌వుల్లో ప్రాధాన్యం లేదు.. మంత్రివ‌ర్గంలో లేదు. క‌నీసం.. క్షేత్ర‌స్థాయిలో నిధులు కూడా స‌క్ర‌మంగా ఇవ్వ‌డంలేద‌ని.. వారు వాపోతున్నారు. క‌రోనా న‌ష్టాల నుంచి కోలేక‌పోతే.. ఇబ్బంద‌ని కూడా వారు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఉమా చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.