Begin typing your search above and press return to search.

విశాఖ రైల్వే జోన్ సాధ్యమేనా ?

By:  Tupaki Desk   |   9 Feb 2022 2:30 PM GMT
విశాఖ రైల్వే జోన్ సాధ్యమేనా ?
X
విభజన చట్టంలోని హామీలు అరిగిపోయిన రికార్డు లాగ తయారైంది. సమైక్య రాష్ట్రాన్ని తెలంగాణా, ఏపీగా యూపీఏ విభజించింది 2014లో. అప్పటి చట్టంలో కీలకమైనవి ఏపీకి ప్రత్యేక హోదా, వైజాగ్ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు లాంటి అనేక అంశాలున్నాయి.

అయితే యూపీఏ స్థానంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీకి సమస్యలు మరింత పెరిగిపోయాయి.

కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ విభజన చట్టాన్ని తుంగలో తొక్కేసింది. కీలకమైన ప్రత్యేక హోదా, ప్రత్యేక రైల్వే జోన్ రాదన్న విషయం అందరికీ అర్థమైపోయింది. అందరికీ తెలిసిన విషయాన్ని బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

వైజాగ్ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ తొందరలో ఏర్పాటవుతోందని చెప్పారు. విశాఖ రైల్వేజోన్ ప్రక్రియ తొందరలో ప్రారంభం కాబోతోందంటు చెప్పటమే విచిత్రంగా ఉంది.

వైజాగ్ రైల్వే జోన్ ఏర్పాటు సాధ్యం కాదని కేంద్రంతో పాటు అన్ని పార్టీలకు బాగా తెలుసు. ఎన్డీయే అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్ళయినా ఇంతవరకు అడుగు ముందుకు పడలేదు. పైగా రైల్వే జోన్ సాధ్యం కాదని కేంద్రం గతంలోనే చెప్పేసింది.
విభజన చట్టం కాస్త రాజకీయ వివాదంగా మార్చేసిన ఘనత మోడీ కే దక్కుతుంది. ఇలాంటి పరిస్ధితిలో తాజాగా జీవీఎల్ నరసింహారావు తొందరలోనే ప్రత్యేక రైల్వే జోన్ అని చెప్పటమే విచిత్రంగా ఉంది.

తాను రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో భేటీ అయినపుడు తొందరలోనే ప్రత్యేక రైల్వే జోన్ ప్రక్రియ ఏర్పాటు కాబోతోందని చెప్పినట్లు జీవిఎల్ చెప్పటమే విడ్డూరంగా ఉంది. జీవీఎల్ తో చెప్పిన ఇంతటి కీలకమైన విషయాన్ని రైల్వేమంత్రి పార్లమెంటులో ఎందుకు ప్రకటించలేదు ? రాష్ట్ర విభజన అంశంపై అసందర్భంగా ప్రస్తావించిన నరేంద్ర మోదీ వైజాగ్ రైల్వే జోన్ అంశాన్ని ఎందుకు ప్రకటించలేదో ?

రైల్వే జోన్ దాకా ఎందుకు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను కూడా బీజేపీ నేతలు ఆపలేకపోతున్నారు. ఈ విషయంలో కూడా తలోమాట మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. కాబట్టి జీవీఎల్ చెప్పిన విషయంపై ఎవరికీ నమ్మకం లేదు.