Begin typing your search above and press return to search.
ఆ పిల్లాడు మోడీకే షాకిచ్చాడు
By: Tupaki Desk | 9 Aug 2016 9:00 AM GMTరాజకీయ నాయకుల సభలు ఏవైనా నిర్వహిస్తే చాలు.. ఆర్టీసీ బస్సులు.. లారీలు.. స్కూల్ బస్సుల్ని వినియోగించటం మామూలే. తాజాగా అలాంటి పనినే ప్రధాని మోడీ సభకు వినియోగించటం ఇప్పుడాయనకు ఇబ్బందికరంగా మారింది. తన స్కూల్ బస్సును ప్రధాని మోడీ సభ కోసం వినియోగించటంపై సదరు పిల్లాడు ప్రధాని మోడీకి ఉత్తరం రాసేశారు. అంతేకాదు.. మీ సభ కోసం మా స్కూల్ మానుకోవాలా? అన్న ప్రశ్న సోషల్ మీడియాలో ఇప్పుడు చక్కర్లు కొడుతూ సంచలనంగా మారింది.
ప్రధాని మోడీకే షాకిచ్చిన ఈ చిన్నారి వ్యవహారాన్ని చూస్తే.. క్విట్ ఇండియా ఉద్యమం వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మధ్యప్రదేశ్‌లో స్వాతంత్ర్య సమరయోథుడు చంద్రశేఖర్ అజాద్ స్వగ్రామమైన భబ్రలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ప్రధాని మోడీ హాజరు కావాల్సి ఉంది. ఈ సభకు అవసరమైన జనసమీకరణ కోసం పలు వాహనాల్ని అధికారులు సేకరించారు. ఇలా సేకరించిన వాహనాల్లో ఎనిమిదో తరగతి చదివే దేవాన్ష్ జైన్ అనే కుర్రాడు చదివే స్కూలుకు చెందిన బస్సు కూడా ఉంది. మోడీ సభ కోసం దేవాన్ష్ స్కూల్ బస్సును అధికారులు సేకరించటంతో.. ఆ కుర్రాడు ప్రధాని మోడీకి ఒకలేఖ రాశారు. మోడీ ర్యాలీ కోసం స్కూల్ బస్సును వినియోగిస్తున్నందున తాను స్కూల్‌కి వెళ్లలేకపోతున్నట్లుగా వెల్లడించిన ఆ కుర్రాడు.. నా స్కూల్ కంటే మీ సభే ముఖ్యమా అని సూటిగా ప్రశ్నించాడు. అంతేకాదు.. మీరు అమెరికాలో సభ నిర్వహించారుగా.. అక్కడ కూడా స్కూల్ బస్సుల్నే వినియోగించారా? అంటూ ఎక్కడ తగలాలో అక్కడ తగిలేలా ప్రశ్న వేయటం.. ఆ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌కావటంతో అధికారులు ఉరుకులు పరుగుల మీద.. ఆ పిల్లాడి స్కూల్ బస్సును ప్రధాని ర్యాలీ నుంచి ఉపసంహరించారు. ఈ ఉదంతం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మొత్తానికి మోడీకి షాకిచ్చిన ఆ కుర్రడి విషయంలో ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.