Begin typing your search above and press return to search.
జగన్ తాజా సర్వేలు అందుకేనా?
By: Tupaki Desk | 15 Nov 2022 11:30 PM GMTవచ్చే ఎన్నికల్లో ఏపీలో 175కి 175 స్థానాలు సాధించాలని ఏపీ సీఎం జగన్ పెద్ద లక్ష్యమే పెట్టుకున్నారు. ఇప్పటికే తమ పార్టీ నేతలకు ఈ లక్ష్యసాధన దిశగా ఆయన కర్తవ్య బోధ చేశారు. గడప గడపకు వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలు వివరించడం మీ బాధ్యత అని ఎమ్మెల్యేలకు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలకు చెబుతున్నారు. మరోవైపు బటన్ నొక్కడం తన బాధ్యత అని వారికి వివరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు లేనిచోట నియోజకవర్గాల ఇన్‌చార్జులు గడప గడపకు తిరిగి వైసీపీ ప్రభుత్వ పథకాలను వివరిస్తున్నారు. తమను వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిపించాలని కోరుతున్నారు.
అయితే పైకి అంతా బాగానే ఉందని అనిపిస్తున్నప్పటికీ ఎక్కడో తేడా కొడుతోందని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పవన్ కల్యాణ్ విశాఖ, ఇప్పటం పర్యటనలను అడ్డుకోవడం, జనసేన నేతలపై అర్ధరాత్రి అరెస్టులు, కార్యకర్తలపై లాఠీచార్జ్ చేయించడం, మోడీ పర్యటన, పవన్‌తో ఆయన ప్రత్యేక భేటీ ఇవన్నీ వైసీపీ అధినేత జగన్‌లో ఆందోళన పెంచుతున్నాయని గాసిప్స్ వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తాజా రాజకీయ పరిస్థితులపై వలంటీర్లతో సర్వే చేయించబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం వలంటీర్లకు శిక్షణ నిర్వహిస్తామని వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వ పథకాలు అందరికీ అందుతున్నాయా? లేదా? ఇంకా మెరుగ్గా ఉండటానికి ప్రజల సూచనలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. అందుకోసమే వలంటీర్లకు శిక్షణ ఇస్తున్నామని చెబుతోంది.
అయితే వాస్తవం అది కాదంటున్నారు. తాజాగా రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోవడం, ఓవైపు జనసేన, మరోవైపు టీడీపీ దూకుడైన రాజకీయం చేస్తుండటంతో రాష్ట్రంలో పరిస్థితులను తెలుసుకోవాలని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నట్టు చెబుతున్నారు.
ఇందుకు వలంటీర్లను రంగంలోకి దింపి సర్వే చేయిస్తారని అంటున్నారు. పైకి మాత్రం ప్రభుత్వ పథకాలపై లబ్ధిదారుల అభిప్రాయం కోసం అని చెబుతున్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేస్తారు, జనసేన -టీడీపీ కలిస్తే ఎన్ని సీట్లు వస్తాయి? వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి ఇలా వివిధ అంశాలను తెలుసుకోవడానికే వలంటీర్లను రంగంలోకి దించుతున్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి.
యుద్ధప్రాతిపదికన చేస్తున్న ఈ సర్వే రెండు రోజుల్లోనే పూర్తవుతుందని అంటున్నారు. సర్వేలో వెల్లడయిన అంశాల ఆధారంగా భవిష్యతు వ్యూహాలు రచించాలని జగన్ భావిస్తున్నట్టు సమాచారం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.