Begin typing your search above and press return to search.
షర్మిల పార్టీ మీడియాకు అంత ఇచ్చిందా?
By: Tupaki Desk | 5 Dec 2022 12:30 PM GMTఉట్టికి ఎగురలేనమ్మ.. స్వర్గానికి నిచ్చెన వేసిందట.. వెనుకటికి ఒకావిడ తన ప్రతిష్టను పెంచుకోవడానికి పడే తపనను ఉదాహరణగా తీసుకొని ఈ సామెత వేశారు. ఈ కాలంలో ఈ సామెతను ఖచ్చితంగా వైఎస్ఆర్టీపీ గౌరవాధ్యక్షురాలు షర్మిలకు వేయకతప్పదని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇన్నాళ్లు తెలంగాణలో పాదయాత్ర చేస్తూ ఎవరినీ తిట్టినా పట్టించుకోలేదు. కానీ హైదరాబాద్ లో ఒక్క ఆందోళనతో నేషనల్ మీడియాలో కూడా వచ్చేలా హైప్ తెచ్చుకుంది షర్మిల. నిన్న చేసిన ఆందోళనలు, అరెస్ట్ లతో కావాల్సినంత మైలేజ్ తెచ్చుకుంది.ఇన్నాళ్లు పట్టించుకోని మీడియా వాళ్లు ఇప్పుడు షర్మిలకు బాగానే ప్రయారిటీ ఇస్తున్నారు. రాజకీయవర్గాలు తిట్టుడు షురూ చేశాయి. టీఆర్ఎస్ కౌంటర్ అటాక్ చేస్తోంది. కానీ జనం షర్మిలను ఏ కోణంలో చూస్తున్నారని అర్థం కావడం లేదు.
తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టి పాదయాత్ర చేస్తూ ఇంతయాగీ చేస్తున్నా జనాలు మాత్రం పట్టించుకున్న పాపానపోవడం లేదు. ఇదంతా డ్రామాలాగానే చూస్తున్నారు జనం. షర్మిల ఏం చేసినా.. మాట్లాడినా తెలంగాణలో నాటకీయత తప్పితే సహజంగా అనిపించడం లేదన్న వాదన జనంలో ఉంది. గతంలో జగన్ సైతం ఇలానే చేశాడు. ఆయనకు సంస్థాగతంగా పార్టీ బలం ఉంది కాబట్టి అక్కడ గెలిచాడు. షర్మిలకు ఇక్కడ వెంట నడిచే నేతలు.. పార్టీ బలం ఏమాత్రం లేదు.
నర్సంపేటలో పాదయాత్ర సందర్భంగా జరిగిన ఘటన మీద మీడియాలో హైలైట్ చేసుకోవడానికి దాదాపు అన్ని చానెల్స్ కు 2 కోట్లు ఇచ్చారు అని లోటస్ పాండ్ టాక్. షర్మిల పాదయాత్ర సందర్భంగా కనీసం ఒక వార్డ్ మెంబర్ కూడా జాయిన్ కాలేదు. అందుకే ఇన్ని రోజులు మీడియా పట్టించుకోలేదు. ఇప్పుడు లైవ్ డిబేట్స్ పిలుస్తున్నారంటే పెద్ద ఎత్తున డబ్బులతో మేనేజ్ చేశారని మీడియా వర్గాల్లో టాక్ నడుస్తోంది.
డబ్బులు ఇవ్వబట్టే ఏకంగా జాతీయ మీడియా సైతం వచ్చి హైదరాబాద్ లో వైఎస్ షర్మిల చేపట్టిన 'ప్రగతి భవన్' ముట్టడిని కవర్ చేశారని.. తెలుగు మీడియా హైలెట్ చేయడంతోనే జాతీయ మీడియా కూడా ఫోకస్ చేయాల్సి వచ్చిందని.. ఇదంతా కూడా షర్మిల డబ్బులిచ్చి మరీ చేసుకున్న ప్రచారం అని టాక్ నడుస్తోంది.
మరోవైపు షర్మిల ఇంతలా యాగీ చేయడానికి వెనుక కేసీఆర్ ఉన్నారా? బీజేపీ ఉందా? అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే జగన్ తో విడిపోయి తెలంగాణలోకి వచ్చిన షర్మిల ఇప్పుడు హైప్ కోసం ఎంతకైనా చేస్తుందని.. అందుకే మరోసారి ఆమె ఇలా వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని డబ్బులిచ్చి మరీ నానా హంగామా చేసిందని టాక్ వినిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.