Begin typing your search above and press return to search.

బాలయ్య షో.. వైఎస్ షర్మిళ కూడా?

By:  Tupaki Desk   |   2 Nov 2022 6:33 AM GMT
బాలయ్య షో.. వైఎస్ షర్మిళ కూడా?
X
నందమూరి బాలకృష్ణ టాక్ షో అన్ స్టాపబుల్ పేరుకు తగ్గట్టుగానే చాలా గ్రాండ్ గా ముందుకు కొనసాగుతోంది. ఇప్పటికే సినీ సెలబ్రిటీలతో పాటు ప్రముఖ రాజకీయ నాయకులు కూడా ఈ షోలోకి రావడం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడుతో సెకండ్ సీజన్ లో బాలయ్య బాబు చాలా గ్రాండ్ గానే మొదలుపెట్టారు.

అందులోనే లోకేష్ కూడా పాల్గొనడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. మొదటి ఎపిసోడ్ లో అనేక రాజకీయ అంశాల గురించి మాట్లాడిన బాలయ్య బాబు కాంట్రవర్సీ విషయాలను కూడా వదిలిపెట్టలేదు. ఇక రాబోయే రోజుల్లో మరి కొంతమంది రాజకీయ నాయకులు ఈ టాక్ షోలోకి ముఖ్య అతిథులుగా రాబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇక ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో వైఎస్ షర్మిల రాబోతున్నట్లుగా టాక్ అయితే కొనసాగుతోంది. ఒక విధంగా వైఎస్ షర్మిల చాలాకాలంగా తన సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై ఇండైరేక్ట్ గా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణలో వైయస్సార్ టీపీ పార్టీని స్థాపించి ఒకవైపు కేసీఆర్ పై విమర్శలు చేస్తూనే మరొకవైపు జగన్ ను కూడా ఏ మాత్రం వదిలిపెట్టడం లేదు.

రీసెంట్ గా ఏబీఎన్ ఓపెన్ హార్ట్ ఆర్కే టాక్ షోలో కూడా ఆమె పాల్గొనడం అందరికీ కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే ఇప్పుడు ప్రత్యర్థిగా ఉన్నటువంటి టీడీపీ నేత బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోలోకి ఆమె వచ్చింది అంటే తప్పకుండా సోదరుడి పై ఆమెకు వైరుధ్యం ఉంటుంది అనే ఆలోచన జనాల్లో రాకుండా ఉండదు. రాజకీయంగా ఇరువురికి కూడా ఇది ఉపయోగపడే అంశమే.

ఇక షో ద్వారా ఆహాకు మరింత ఫాలోయింగ్ పెరగడం కాయంగా చెప్పవచ్చు. కానీ ఈ కాంబినేషన్ సెట్ చేయడం అంటే సాధారణ విషయం కాదు. నందమూరి బాలకృష్ణ వైఎస్ షర్మిల ఎదురుగా కూర్చుని ఉంటే మాత్రం ప్రశ్నల వర్షం మామూలుగా ఉండదు.

కాబట్టి ఈ గాసిప్ అంత ఈజీగా నమ్మడానికి వీల్లేదు. కానీ రాజకీయపరంగా చూస్తే మాత్రం వైఎస్ షర్మిల తనకు లాభం అనుకుంటే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.