Begin typing your search above and press return to search.

నవంబర్లో వైజాగ్ కు మారబోతున్నారా?

By:  Tupaki Desk   |   14 Oct 2022 6:34 AM GMT
నవంబర్లో వైజాగ్ కు మారబోతున్నారా?
X
దీపావళి పండుగ తర్వాత అంటే నవంబర్ నెలలో జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంకు తరలి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వైజాగ్ లో క్యాంపు కార్యాలయం నిర్మాణం దాదాపు అయిపోవచ్చింది. మూడు రాజదానుల ప్రతిపాదనకు తాను కట్టుబడున్నట్లు ఇఫ్పటికే జగన్ చాలాసార్లు ప్రకటించారు. ఉత్తరాంధ్ర జనాల్లో తన ప్రకటనపైన నమ్మకం ఉండేట్లుగా దీపావళి పండుగ అయిపోయిన తర్వాత నవంబర్లో ఒక ముహూర్తం చూసుకుని వైజాగ్ ఫిష్ట్ అవ్వాలని జగన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ఈ విషయం చెప్పటానికే గవర్నరన్ బిశ్వభూషణ్ హరిచందన్ను సీఎం కలిశారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. వీళ్ళిద్దరి భేటీలో మూడు రాజధానుల అంశం, వైజాగ్ లో ప్రజాగర్జన పేరుతో జరగబోయే బహిరంగసభ, అమరావతి పాదయాత్ర లాంటి అనేక అంశాలపై గవర్నర్ కు జగన్ వివరణ ఇచ్చారట.

ఇప్పటికే విశాఖకు జగన్ వెళిపోతున్నారంటు చాలాసార్లు వార్తలు వచ్చాయి. అయితే అవేవీ నిజాలు కాలేదు. అయితే రాబోయే నవంబర్లో క్యాంపాఫీను తరలించటం మాత్రం ఖాయమంటున్నారు.

నవంబర్లో వైజాగ్ వెళ్ళటం ఖాయమని ఎందుకంటున్నారంటే అక్కడ క్యాంపు ఆఫీసు నిర్మాణం దాదాపు పూర్తయిపోవచ్చిందట. కనీసం వారానికి మూడురోజులు విశాఖలోనే కూర్చుని ఉత్తరాంధ్ర సమస్యల పరిష్కారంపై జగన్ దృష్టిపెట్టబోతున్నట్లు పార్టీవర్గాలంటున్నాయి.

దీనివల్ల వచ్చే ఎన్నికలనాటికి ఉత్తరాంధ్రలోని మూడుజిల్లాల్లోని చాలా సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలున్నట్లు నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖను ప్రకటించిన తర్వాత ఉత్తరాంధ్రలో రాజధాని సెంటిమెంటు పెరిగిపోతోందని వైసీపీ నేతలు అంచనాలు వేస్తున్నారు.

ఈ దశలో పూర్తిస్ధాయి రాజధాని రాకపోయినా కనీసం క్యాంపుఆఫీసున్నా వచ్చేస్తే జనాలు ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకుంటారనేది వైసీపీ నేతల ఆలోచన. ఇదే విషయాన్ని చాలాసార్లు నేతలు జగన్ కు స్పష్టంచేశారట. అందుకనే క్యాంపాఫీసు నిర్మాణాన్ని స్పీడుచేశారు. ఇపుడా నిర్మాణం కూడా పూర్తయిపోవచ్చింది కాబట్టి నవంబర్ నుండి జగన్ వైజాగ్ లో కూర్చోవటానికి పరిస్ధితులు సానుకూలంగా ఉండబోతున్నాయని అంచనా వేస్తున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.