Begin typing your search above and press return to search.
నెల్లూరు జిల్లాలో వైసీపీకి షాకేనట...నిజమా...?
By: Tupaki Desk | 22 Oct 2022 1:30 AM GMTఏపీలో రాజకీయంగా చూస్తే అతి కీలకమైన జిల్లాగా నెల్లూరు ఉంది. వైసీపీ ఏర్పాటు చేశాక ఈ జిల్లా ఆ పార్టీకే సలాం అంటూ ఎంతో అండగా ఉంది. దానికి కారణం జిల్లాలో బలమైన మేకపాటి కుటుంబం ఆ పార్టీ వైపు ఉంది. అలాగే జగన్ కి తరగని ఆదరణ కూడా ఇక్కడ ఉంది. అయితే ఈసారి ఎన్నికల ఫలితాలు మాత్రం అలా ఉండవని అంటున్నారు. లేటెస్ట్ గా చేసిన కొన్ని సర్వేలు అంటూ ప్రచారంలో ఉన్న విషయం చూస్తే మాత్రం నెల్లూరు జిల్లాలో వైసీపీకి గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదని అంటున్నారు
ఇక విషయానికి వస్తే 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసి పారేసింది. ఈ జిల్లాలో మొత్తానికి మొత్తం పది సీట్లను వైసీపీ గెలుచుకుని జెండా ఎగరేసింది. ఒక విధంగా వైసీపీకి ఇది బ్రహ్మాండమైన ఫలితం అన్న మాట. 2014 నుంచి 2019 దాకా అధికారంలో ఉన్న టీడీపీ అయితే జిల్లాలో ఉన్న పది స్థానాల్లో కూడా ఎక్కడా కనీసం ఖాతా అయినా తెరవలేకపోయింది.
అలా ఫ్యాన్ నీడన చల్లగా ఉన్న నెల్లూరు రాజకీయాల్లో ఇపుడు బోలెడు మార్పులు సంభవిస్తున్నాయి అని అంటున్నారు. ఆ పార్టీకి సంబంధించి చూస్తే సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి 2019 తరువాత రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఇక డైనమిక్ లీడర్ గా పేరు గడించిన మేకపాటి గౌతం రెడ్డి హఠాత్తుగా మరణించారు. దాంతో వైసీపీకి గట్టి దెబ్బ తగిలింది. మరో వైపు చూస్తే వైసీపీ పాలన మీద ప్రజలు తక్కువ మార్కులు వేస్తున్నారు
జిల్లా పునర్విభజన సజావుగా సాగలేదన్న బాధ అసంతృప్తి అయితే జనాల్లో ఉంది. జిల్లాలో కీలక నేత, మాజీ మంత్రి ఆనం రాం నారాయణరెడ్డి సైలెంట్ అయ్యారు. ఆయన టీడీపీ వైపు చూడవచ్చు అంటున్నారు. అలాగే నిన్నటిదాకా మంత్రిగా చేసిన నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కి ఈసారి గడ్డు పరిస్థితి అని చెబుతున్నారు.
ఇక ఇలా చూసుకుంటే తాజా పరిణామాల నేపధ్యంలో జిల్లాలో ఆ పార్టీ కనీసం ఐదు స్థానాలు కోల్పోవాల్సి వస్తుందని వివిధ సర్వేలు చెబుతున్నాయని పెద్ద ఎత్తున ప్రచారం అయితే సాగుతోంది మరి. మొత్తం పది సీట్లలో వైసీపీకి ఆదరణ ఉన్నవి ఏంటి అన్నది లెక్క తీస్తే గూడూరు, వెంకటగిరి, నెల్లూరు అర్బన్, కొవ్వూరు, కావలి ఇలా అయిద్ స్థానలలో మాత్రమే వైసీపీ వెనకబడింది అని అంటున్నారు.
ఇక చూస్తే సర్వేపల్లిలో ప్రస్తుత మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డికి ఉన్న ఆదరణ కారణంగా తిరిగి గెలవవచ్చు అంటున్నారు. అలాగే ఆత్మకూర్, ఉదయగిరి నియోజకవర్గాల్లో మేకపాటి కుటుంబీకులకు ఉన్న ఆదరణతో పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉంది అని చెబుతున్నారు. అలాగే, సూళ్లూరుపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే కలివేటి సంజీవయ్యను మార్చాలని జగన్ ఆలోచిస్తున్నారని టాక్. అలాగే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన వ్యక్తిగత పాపులారిటీ కారణంగా తన నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఇప్పటికీ నిలబెట్టుకోగలుగుతున్నారు అని చెబుతున్నారు.
అంటే అయిదు చోట్ల వైసీపీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయనే సర్వేలు చెబుతున్నాయని అంటున్నారు. మరి ఇందులో ఎంతమేరకు వాస్తవాలు బయటపడ్డాయో తెలియదు కానీ ఒక్క మాట మాత్రం నిజం. అధికార పార్టీకి వ్యతిరేకత ఉంటుంది. అలాగే స్థానికంగా పరిస్థితులు రాజకీయంగా ఎప్పటికపుడు మారుతున్నాయి. దాంతో ఇలాంటి సర్వే ఫలితాలను పక్కన పడేయకుండా అలెర్ట్ అయితేనే అధికార పార్టీ ఒడ్డున పడగలదు అని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.