Begin typing your search above and press return to search.
టీడీపీ కీలక నేతకు జగన్ సర్కార్ భద్రత ఉపసంహరించిందా?
By: Tupaki Desk | 11 July 2022 8:30 AM GMTఆంధ్రప్రదేశ్ లో రాయలసీమలోని అనంతపురం జిల్లాలో టీడీపీ కీలక నేతగా ఉన్నారు.. పయ్యావుల కేశవ్. ప్రస్తుతం ఉరవకొండ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్ గా కూడా ఉన్నారు. దీనికి కేబినెట్ మంత్రి హోదా ఉంటుంది. సాధారణంగా ఈ పదవిని ప్రతిపక్ష నేతలకు కట్టబెడతారు. కేబినెట్ మంత్రి హోదా ఉండటంతో టీడీపీలో ఎంతో మంది పీఏసీ చైర్మన్ పదవికి పోటీపడ్డారు. అయితే మంచి వాగ్దాటి, విషయ పరిజ్ఞానం ఉన్న నేత కావడంతో పయ్యావులను ఈ పదవికి టీడీపీ అధినేత చంద్రబాబు ఎంపిక చేశారు.
టీడీపీ ఫైర్ బ్రాండుగా జగన్ ప్రభుత్వంపైన పదునైన విమర్శలు చేసేవారిలో ముందు వరుసలో ఉంటారు.. పయ్యావుల కేశవ్. ఉరవకొండ నుంచి మొత్తం నాలుగుసార్లు గెలుపొందిన పయ్యావుల తన సూటి విమర్శలతో జగన్ ప్రభుత్వంపై విమర్శలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు జగన్ ప్రభుత్వం భద్రత ఉపసంహరించిందని వార్తలు వస్తున్నాయి.
ఆయనకు ప్రస్తుతం ఉన్న వన్ ప్లస్ వన్ భద్రత ఉండదగా దాన్ని టు ప్లస్ టు కు పెంచాలని ఈ మధ్యనే ఆయన ప్రభుత్వానికి విన్నవించారు. అయితే, ప్రభుత్వం ఆయన గన్ మెన్లను వెనక్కు రావాల్సిందిగా ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపైన మండిపడుతున్నారు.
అయితే, అనంతపురం జిల్లా పోలీసులు మాత్రం పయ్యావులకు గన్ మెన్లను తొలగించారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని అంటున్నారు. ప్రస్తుతం ఆయనకు కొనసాగుతున్న వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ కంటిన్యూ అవుతుందని స్పష్టం చేస్తున్నారు.
కాగా పయ్యావుల కేశవ్ .. జగన్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తుండటం వల్లే ఆయన భద్రతను కుదించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్ ప్రభుత్వం టీడీపీ నేతలపై ఫోన్ ట్యాపింగుకు పాల్పడుతోందని పయ్యావుల రెండు రోజుల క్రితం సంచలన ఆరోపణలు చేశారు. జగన్ ప్రభుత్వం వైఎస్సార్సీపీలో ముఖ్య నేతలతోపాటు, సాక్షి దినపత్రికలో ముఖ్యమైన వ్యక్తులపైనా, టీడీపీలో ముఖ్యమైన నేతల ఫోన్లపైనా నిఘా పెట్టిందని.. వారి ఫోన్ల ట్యాపింగ్ చేస్తోందని తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యేలకు ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు, లాప్ టాప్ లు సైతం వినియోగించాలంటే వారు భయపడుతున్నారని పయ్యావుల కేశవ్ హాట్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వం వాటిని ట్యాపింగ్ చేస్తుండటమే ఇందుకు కారణమని చెప్పారు. ఈ నేపథ్యంలో పయ్యావుల కేశవ్ కామెంట్లను జగన్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని సమాచారం.
అందువల్లే ఇప్పుడు పయ్యావుల గన్ మెన్లను భద్రత ఉపసంహరించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. భద్రత పెంచాలని ఆయన కోరితే..ఉపసంహరించడం ఏంటని నిలదీస్తున్నారు.