Begin typing your search above and press return to search.
జగన్ కు షర్మిల తలనొప్పిగా మారారా?
By: Tupaki Desk | 30 Nov 2022 4:29 AM GMTతిరుగులేని అధికారాన్ని చెలాయించే వారికి ఒక సమస్య ఉంటుంది. తమను ఇరుకున పడేసే సత్తా ప్రత్యర్థుల్లో అంతగా లేదన్నట్లుగా ఉన్న వేళ.. అందుకు భిన్నమైన పరిస్థితులు ఎదురైతే? చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బ తీసే వరకు వెళుతుంది. ఇప్పుడు అలాంటి ఇబ్బందినే ఏపీ అధికారపక్షం ఎదుర్కొంటోంది. తెలంగాణతో పోలిస్తే ఏపీ అధికారపక్షాన్ని ఇరుకున పెట్టే విపక్షాల రూపంలో తెలుగుదేశం.. జనసేన ఉన్నప్పటికి తమకున్న బలం.. బలగంతో వారిపై ఎప్పుడూ పైచేయి సాధిస్తున్న భావన కలిగేలా చేస్తున్నారు. ఈ విషయంలో ఏపీ అధికారపక్షం ఇరుకున పడిన పరిస్థితి ఇప్పటివరకు లేదు.
అందుకు భిన్నంగా ఇప్పుడు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తెలంగాణలో పార్టీ ఏర్పాటు విషయంలో తన సోదరితో జగన్ విభేధించినట్లుగా చెబుతారు. అది లేనిపోని తలనొప్పులకు దారి తీస్తుందని.. పార్టీ పెట్టొద్దని చెప్పటమే కాదు.. తమ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న వారితోనూ చర్చలు జరిగినట్లుగా చెబుతారు. అయితే.. తాను తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విషయంలో షర్మిల సిద్దంగా లేకపోవటం.. అనుకున్నట్లే ఆమె పార్టీని ఏర్పాటు చేయటం తెలిసిందే.
పార్టీ పెట్టింది మొదలు.. ఏదో ఒక కార్యక్రమాన్ని చేపడుతూ ప్రజల్లోనూ.. వార్తల్లోనూ ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె చేపట్టిన పాదయాత్ర చూస్తుండగానే 3500 కిలోమీటర్లకు వచ్చేసింది. తాను ఏ నియోజకవర్గానికి వెళ్లినా.. అక్కడి స్థానిక ఎమ్మెల్యే ఏ పార్టీ వారైనా సరే దుమ్ము దులిపేయటం కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రాజకీయ అధినేత.. ఇంత స్థిరంగా ఒకరి తర్వాత ఒకరు చొప్పున ఘాటు విమర్శలు.. ఆరోపణలతో వ్యాఖ్యలు చేసింది లేదు.
పార్టీ పెట్టిన మొదట్లో కానీ పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు కానీ గులాబీ బాస్ కు ఆయన పరివారానికి షర్మిల పెద్దగా పట్టింది లేదు. ఇలాంటివెన్నో చూశామనుకున్నారే కానీ.. షర్మిలను సరిగా అర్థం చేసుకున్నది లేదు. షర్మిల వాణి వినటం మొదలైన తర్వాత నుంచి కొత్త గుబులు మొదలైంది. అంతకంతకూ పెరిగిపెద్దది అవుతున్న వ్యవహారం ఇప్పుడు సమాధానం చెప్పకోలేనట్లుగా మారింది. దీంతో.. టీఆర్ఎస్ అధినాయకత్వానికి.. నేతలకు ఇప్పుడు టార్గెట్ చేయటం ఎలా అన్నది ప్రశ్నగా మారింది.
దీంతో.. ఇంతకాలం ఏపీ ప్రభుత్వం గురించి.. ఏపీ ముఖ్యమంత్రి గురించి కానీ పట్టించుకోని వారికి ఇప్పుడు అక్కడి పరిస్థితులు.. జగన్ ప్రభుత్వంలో జరుగుతున్న వ్యవహారాలను ఎత్తి చూపుతూ విమర్శలు గుప్పించటం మొదలు పెట్టారు. ఇంతకాలం లేని ఇబ్బంది ఇప్పుడు రావటం.. అది కాస్తా తిరిగి.. తిరిగి తన మీదకు గురిగా మారటం జగన్ కు ఇబ్బందికరంగా మారిందంటున్నారు.
ఎవరెన్ని చెప్పినా.. తన సోదరి విషయాన్ని తాను చూడాల్సి వస్తుందన్న జగన్ వాదన వాస్తవరూపం దాల్చిన పరిస్థితి. ఓవైపు విపక్షాలపై విరుచుకుపడుతున్న వేళ.. ఇప్పుడు షర్మిల రూపంలో వచ్చిన సమస్య జగన్ పరివారానికి కొత్త తలనొప్పిగా మారిన పరిస్థితి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.