Begin typing your search above and press return to search.

షాకింగ్: ట్రంప్ గెలుపుతో ఐసిస్ పండగ...

By:  Tupaki Desk   |   10 Nov 2016 2:07 PM GMT
షాకింగ్: ట్రంప్ గెలుపుతో ఐసిస్ పండగ...
X
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలపుతో ఎవరికి లాభం - ఎవరికి నష్టం అనే అంచనాలు ఒకపక్క ప్రపంచ దేశాలన్నీ వేసుకుంటున్నాయి. ఈ సమయంలో ట్రంప్ వ్యతిరేకులు అమెరికా వీదుల్లో నిరసనలకు దిగుతున్నారు. అయితే... ట్రంప్ గెలుపుతో ఉగ్రవాద సంస్థలు మాత్రం పండగచేసుకుంటున్నాయట. వినడానికి షాకింగ్ అనిపించినా ఇది వాస్తవం అని "వాషింగ్టన్ పోస్ట్" పేర్కొంది.

ట్రంప్ గెలుపుతో మిగిలిన వారి ఆనందాలు - బాదలు ఎలా ఉన్నా... డాయిష్ (ఐసిస్) - లష్కరే తాయిబా (ఎల్‌.ఈ.టీ)లు సంబరాల్లో మునిగిపోయాయట. ట్రంప్ గెలుపుతో అమెరికాకు మూడిందంటూ.. "చీకటి రోజులు" మొదలయ్యాయని చెబుతూ ఉగ్రవాదులు సంతోషం వ్యక్తం చేస్తున్నారట. బిలియనీర్ బిజినెస్‌ మన్ చేతిలో అమెరికా పతనం తప్పదని వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారట. ఈమేరకు ట్రంప్ గెచిన వెంటనే ఉగ్రవాద సంస్థలతో అత్యంత సన్నిహితంగా ఉండే సిద్ధాంతకర్తలు సోషల్ మీడియాలో సంతోషం వ్యక్తం చేస్తూ పోస్టుల మీద పోస్టులు చేసినట్లు అమెరికా న్యూస్ వెబ్ సైట్స్ లోనూ - పత్రికల్లోనూ కథనాలొస్తున్నాయి!!

ఇదే క్రమంలో "చాలా సంతోషంగా ఉంది.. ట్రంప్ చేతుల్లో పడిన అమెరికా క్రమంగా పతనం అవుతుంది.." అని డాయిష్ అనుబంధ అల్-మిన్‌ బార్ జిహాదీ మీడియా నెట్‌ వర్క్ పేర్కొనగా... "9/11న అమెరికాను ఆల్ ఖాయిదా నాశనం చేస్తే 11/9న అమెరికా ఓటర్లే తమ దేశాన్ని నాశనం చేసుకున్నారు" అని జిహాదీ వెబ్‌ సైట్లను పర్యవేక్షించే ప్రైవేటు సంస్థ ఎస్.టి.ఈ ఇంటెలిజెన్స్ గ్రూప్ డైరెక్టర్ రిట్జ్ కట్జ్ పేర్కొన్నారు. కాగా ఎన్నికల రోజు అమెరికన్ ఓటర్లను ఊచకోత కోస్తామని డాయిష్ ఉగ్రవాద సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే! కాని అలాంటి అవాంచనీయ ఘటనలేమీ జరగలేదు!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/