Begin typing your search above and press return to search.

ఆ ముస్లిం మతగురువులను చంపేస్తాం

By:  Tupaki Desk   |   14 April 2016 8:39 AM GMT
ఆ ముస్లిం మతగురువులను చంపేస్తాం
X
పురాణాల్లో చెప్పుకునే రాక్షసులు లేరన్న భావన అస్సలు కలగకుండా చేస్తుంటారు ఐఎస్ తీవ్రవాదులు. రక్తం తాగే జంతువుల కంటే దారుణంగా వ్యవహరించే వారి రాక్షసత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే. నిజానికి పురాణాల్లో చెప్పే రాక్షసులకు అయినా కాస్త నీతి ఏడుస్తుంది. కానీ.. ఐఎస్ తీవ్రవాదుకుల అలాంటిది ఏ కోశాన కూడా ఉన్నట్లు కనిపించదు. తమను వ్యతిరేకించే వారు ఎవరైనా సరే.. ఎంతమందినైనా సరే చంపేయాలనటం వారికే చెల్లుతుంది.

హింస సైతం వణికిపోయేలా వ్యవహరించే అలవాటున్న ఐఎస్ తీవ్రవాదులు తాజాగా తమ సొంత పత్రిక ‘డబిక్’లో కొన్ని దారుణ వ్యాఖ్యలు చేశారు. తమను వ్యతిరేకించే ఇస్లాం మత గురువులను నరికేయాలంటూ వ్యాఖ్యానించారు. ఇటీవల కాలంలో బ్రిటన్.. భారత్ కు చెందిన పలువురు ఇస్లాం మత పెద్దలు ఐఎస్ తీవ్రవాదులకు వ్యతిరేకంగా ఫత్వా జారీ చేశారు. దీనిపై ఐఎస్ తీవ్రవాదులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ కార్యకలాపాల్ని వ్యతిరేకించే మత గురువులను నరికేయాల్సిందిగా ఐఎస్ నేతలు పిలుపునిస్తున్నారు.

భారత్.. బ్రిటన్ లలో దాదాపు వెయ్యి మంది వరకూ మత గురువులు ఐఎస్ ను వ్యతిరేకిస్తున్నారు. ఫత్వాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఐఎస్ తీవ్రవాదులు.. తమను వ్యతిరేకించే వారు ఎవరూ నిజమై ముస్లింలు కాదని.. అలాంటి వారందరిని మత అవిశ్వాసుల గురువులుగా తాము భావిస్తామన్న ఐఎస్ తీవ్రవాదులు.. తమను వ్యతిరేకించే మత గురువుల జాబితాను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. తమను వ్యతిరేకించే వారెంత మంది అయినా చంపేయాలంటూ ఆదేశాలు జారీ చేస్తున్న తీరు చూస్తేనే ఐఎస్ తీవ్రవాదులు కాదని రాక్షసులనిపించకమానదు.