Begin typing your search above and press return to search.
వామ్మో... 12-14 ఏళ్ల బాలురే వారి టార్గెట్!
By: Tupaki Desk | 23 Aug 2016 5:37 AM GMTటర్కీలోని ఘజియాన్ టేప్ నగరంలో పెళ్లి బృందంపై జరిగిన ఆత్మాహుతి దాడిలో 54 మంది మృతి చెందిన సంఘటన గురించి తెలిసిందే. పెళ్లివేడుకను టార్గెట్ చేసుకున్న ఐఎస్ ఉగ్రవాదులు.. ఈ దారుణానికి 12 - 14ఏళ్ల వయసున్న బాలుడిని ఆత్మాహుతికి వాడుకున్నారు. ఈ విషయం తెలిసిన తర్వాత ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మైనర్లను మాయచేసి - మాయమాటలతో లోబరచుకుని ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారని ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఫైరయ్యింది. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన మరో సంఘటన తెలిస్తే.. ఈ విషయంలో ఉగ్రవాదులు ఫిక్సయినట్లు తెలుస్తుంది.
తాజాగా ఇరాక్ లోని కిర్కుక్ పట్టణంలో బెల్టు బాంబు పేల్చుకోవడానికి సిద్ధమైన ఒక బాలుణ్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ దృశ్యాలు స్థానిక టీవీ చానెళ్లలో ప్రసారమయ్యాయి. ఆ బాలుడిని ఇద్దరు పోలీసులు గట్టిగా పట్టుకోగా ఒకరు బెల్టు బాంబును సేఫ్ గా తొలగించారు. అనంతరం అక్కడ నుండి ఆ బాలుణ్ని పోలీసులు తీసుకెళ్లారు. పోలీసులు సకాలంలో అతడిని గుర్తించడంతో ఒక భారీ ప్రమాదమే తప్పిందని చెప్పాలి. అయితే ఈ సమయంలో ఆ బాలుడి వయస్సు కచ్చితంగా వెల్లడించడంలేదు కానీ.. అతడి వయసు కూడా 12 - 14 ఏళ్లలో ఉంటుందని కథనాలు వెలువడుతున్నాయి. అయితే.. తీవ్రవాదులు ఈ బాలుడిని కిడ్నాప్ చేసి మానవ బాంబుగా తయారుచేసినట్టు స్థానిక పోలీసులు చెబుతున్నారు.
ఈ రెండు విషయాలనూ పరిగణలోకి తీసుకున్న పోలీసులు.. ఈ విషయంలో ఉగ్రవాదులు బాలురినే టార్గెట్ చేయడంపై కొత్త పథకాలు రచిస్తున్నారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ బాలురు.. ఉగ్రవాదంపై తెలిసీ తెలియని వయసులో ఆకర్షణకు గురవుతున్నారేమో అని అనుమానం ఒకవైపు వ్యక్తమవుతున్నా... తాజాగా దొరికిన ఈ బాలుడు చెబుతున్న విషయాలు మాత్రం మరోలా ఉన్నాయి. ఈ విషయాలపై స్పందించిన బాలుడు... ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు తనను కిడ్నాప్ చేశారని, తనకు బలవంతంగా బెల్ట్ బాంబు ధరింపచేసి ఇక్కడకు పంపారని చెబుతున్నాడట.