Begin typing your search above and press return to search.
రాక్షసుల చేతికి అణుబాంబు?
By: Tupaki Desk | 23 May 2015 2:15 PM GMTమనిషిలో ఉండాల్సిన మానత్వం రవ్వంత కూడా లేకుండా.. మతమౌఢ్యంతో.. పిచ్చిపట్టినట్లు వ్యవహరిస్తూ.. అత్యంత అనాగరికంగా.. రాక్షసంగా వ్యవహరించే ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల దారుణాలు అన్ని ఇన్ని కావు. ఆరాచకానికి కేరాఫ్ అడ్రస్‌గా వ్యవహరిస్తూ.. ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న ఈ ఉగ్రవాద సంస్థ తాజాగా ఒక పెద్ద బాంబునే పేల్చింది.
రానున్న పన్నెండు నెలల్లో తాము అణుబాంబును సమకూర్చుకుంటామని పేర్కొంది. అది కూడా పాకిస్థాన్ నుంచే అణుబాంబును సంపాదిస్తామని చెప్పటం తాజాగా ఆందోళన రేకెత్తిస్తోంది. ప్రాశ్చాత్య దేశాలను లక్ష్యంగా చేసుకొని దాడి చేయటమే తమ లక్ష్యమని చెబుతున్న ఐఎస్ ఐఎస్ సంస్థ.. మరో ఏడాది లోపు తమ చేతికి అణ్వాయుధం రావటం ఖాయమని చెబుతోంది. పిచ్చోడి చేతిలో రాయి ఉంటే జరిగే నష్టం కాస్త ఎక్కువ. కానీ.. పిచ్చికి మించిన పైశాచికత్వంతో వ్యవహరించే ఐఎస్ ఐఎస్ తీవ్రవాదుల చేతికి అణ్వాయుధం చిక్కితే.. ప్రపంచం పరిస్థితి ఏమిటి..?