Begin typing your search above and press return to search.
బందీలను విడిపించాలంటే.. రూ.1236కోట్లు ఇవ్వాలంట
By: Tupaki Desk | 21 Jan 2015 12:30 AM GMTఊహించని విధంగా ఉగ్రదాడులతో విరుచుకుపడుతున్న ఐఎస్‌ఐఎస్ తాజాగా మరో కిరాతకానికి తెర తీసేలా ఉంది. తమ వద్ద బంధీలుగా ఉన్న జపనీయుల్ని క్షేమంగా విడిచి పెట్టాలంటే భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నారు.
పాశ్చాత్య దేశాల సైనిక దాడులను జపాన్ సమర్థిస్తున్న నేపథ్యంలో ఆ దేశానికి చెందిన పౌరులను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు వెల్లడించిన ఐసిస్ ఉగ్రవాదులు.. తమ చెర నుంచి బందీలను విడిపించేందుకు ఏకంగా రూ.1236కోట్లు చెల్లించాలని పట్టుపడుతున్నారు.
ఐసిస్‌కు చెందిన అనుబంధ సంస్థ అల్ పుర్ఖాన్ మీడియా బందీలకు సంబంధించిన ఒక వీడియోను ఆన్‌లైన్ లో పోస్టు చేసింది. సదరు వీడియోలో కనిపించిన జపనీయులను గుర్తించినట్లుగా చెబుతున్నారు. ఐసిస్ తాజా హెచ్చరికపై జపాన్ స్పందించలేదు.
కానీ బందీలను విడిపించేందుకు వేలాది కోట్ల రూపాయిలు డిమాండ్ చేస్తున్న వైనం చూస్తుంటే రానున్న రోజుల్లో మరిన్ని దారుణాలకు ఐసిస్ ప్రణాళిక రచిస్తుందన్న భావన కలుగుతోంది. తాజాగా.. జపాన్ ప్రధాని ఈ వ్యవహారంపై స్పందించారు. బందీలకు ఎలాంటి హాని కలుగజేయకుండా విడుదల చేయాలని కోరారు.