Begin typing your search above and press return to search.

తలకిందులుగా వేలాడదీసి తగలబెట్టేశారు!

By:  Tupaki Desk   |   2 Sept 2015 10:20 AM IST
తలకిందులుగా వేలాడదీసి తగలబెట్టేశారు!
X
చంపడంలో వారి క్రియేటివిటీ బాగా పనిచేస్తుంది. ఒకరిని చంపినట్లు, నిన్న చంపినట్లు నేడు చంపడంలేదు. ప్రతీ రోజూ కొత్తగా ఉండాలని ప్లాన్స్ వేసుకుంటున్నారు. గరుడపురాణంలో కూడా ఇన్ని రకాల శిక్షలు ఉంటాయా అనే అనుమానం కలిగేలా వికృత పద్ధతులలో వినూత్న విధానాల్తో ప్రత్యర్థులను హింసించి, ప్రపంచం మొత్తం ఉలిక్కిపడేలా హత్యలుచేస్తారు. వీటికి హత్యలు అనే కంటే ఏదైనా కొత్త పేరుపెడితే బాగుంటుంది. రాక్షసుడు భూమిపై పుడితే వాడే ఐఎస్ ఐఎస్ ఉగ్రవాదేమో అనే స్థాయిలో వీరి వికృతత్వం ఉంటుంది! తాజాగా విడుదలచేసిన మరో హత్యాకాండకు సంబందించిన వీడియో.. వీరి రాక్షసత్వానికి మరో ఉదాహరణ!

తాజాగా... తమకు వ్యతిరేకంగా ఇరాక్ సైనికులతో కలిసి గూఢచర్యం చేస్తున్నారనే అనుమానంతో నలుగురు ఇరాకీలను పట్టుకున్నారు ఐఎస్ ఐఎస్ ఉగ్రవాదులు. అనంతరం గతంలో ఐఎస్ ఐఎస్ ఉగ్రవాదులను ఇరాక్ సైన్యం ఎలా హింసించి చంపిందో ఆ వీడియోలు వారికి చూపించారు. అప్పటికే విషయం అర్ధం చేసుకున్న ఆ నలుగురితో.. మిమ్మల్ని ఇంతకంటే దారుణంగా క్రూరంగా చంపుతామని అన్నారు. అన్నట్లు గానే ఆ నలుగురిని.. పైన ఏర్పాటుచేసిన ఒక ఇనుపరాడ్ కి గొలుసులతో కాళ్లూ చేత్లూ కట్టేసి తలక్రిందులుగా వేళాడదీశారు. అనంతరం వారి తలకింద నేలపై పెట్రోలు పోసి మంటపెట్టారు. ఈ క్రమంలో ఆ మంట ముందుగా ఆ నలుగురి ముఖాలను కాల్చేసి, అనంతరం శరీరం మొత్తాన్ని ముద్దలా మార్చేసింది. సజీవంగా ఉన్న వారిని కాస్త ఆ అగ్నికిలలు మాడిపోయిన మాంసపు ముద్దలుగా చేసేశాయి! తాజాగా విడుదలైన ఈ వీడియో ఇరాక్ లోని అంబర్ ప్రాంతంలో చిత్రీకరించినట్లు తెలుస్తోంది! తాజాగా విడుదలైన ఈ వీడియో నరకలోకం హింసలకు నకలేమో అనే అనుమానం కలుగుతుంది!