Begin typing your search above and press return to search.
ఐఎస్.. అన్ని చోట్లా ఇప్పుడవే వార్తలు
By: Tupaki Desk | 20 Nov 2015 6:07 AM GMTఅక్కడా.. ఇక్కడా అన్న తేడా లేకుండా ప్రపంచంలోని పలు దేశాల్లో ఇప్పుడు ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద సంస్థకు సంబంధించిన కార్యకలాపాలు.. వారికి సంబంధించి వార్తలే హడావుడి చేస్తున్నాయి. సిరియా.. ఇరాక్ లలో బంధీలను దారుణంగా హతమార్చిన సందర్భాల్లోనూ.. ఇరాక్.. సిరియాలలో దాడులు చేసిన సమయాల్లో కొన్ని వార్తలు వచ్చేవి. ఆ స్థానే ఇప్పుడు అందరిలోనే ఐఎస్ మీద ఫోకస్ విపరీతంగా పెరిగింది. ఫ్రాన్స్ లోని ప్యారిస్ ఉగ్ర ఘటన అనంతరం.. ఇప్పుడు ఐఎస్ మీద మరింతగా దృష్టి సారిస్తున్నారు.
మరోవైపు ఐఎస్ సైతం తన దూకుడును మరింత పెంచింది. అగ్రరాజ్యాలు తనను టార్గెట్ చేస్తున్నా పెద్దగా ఖాతరు చేయకుండా తన దారుణ మారణకాండను కొనసాగిస్తూనే ఉంది. తాజాగా ఐఎస్ కు సంబంధించి చోటు చేసుకున్న పలు పరిణామాలు చూస్తే..
= ఇరాక్ లోని అన్బర్ ప్రావిన్స్ లో గూఢాచారులన్న ఆరోపణల మీద ఐదుగురు వ్యక్తుల్ని కిరాతకంగా కాల్చి చంపింది. దీనికి సంబంధించి ఫోటోల్ని ఆన్ లైన్ లో పెట్టింది. ఈ దారుణ ఘటనకు ముందు చైనా.. నార్వే దేశాలకు చెందిన పౌరుల్ని హతమార్చటం.. ఆ ఘటన మీద ఆయా దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటం తెలిసిందే. వాటిని పెద్దగా పట్టించుకోని ఐఎస్ తన మారణకాండను కొనసాగించటం గమనార్హం.
= తమ దేశానికి చెందిన వారిని కిరాతకంగా చంపటంపై చైనా అగ్గి మీద గుగ్గిలం అవుతుంది. ప్రపంచంలో ఐఎస్ ఎన్ని దారుణాలకు పాల్పడినా తనకు పట్టనట్లుగా వ్యవహరించే చైనా.. తాజాగా తమ జాతీయుడ్ని చంపేయటంపై సీరియస్ అయ్యింది. ఐఎస్ అంతు చూస్తామని ప్రకటించింది.
= ఐఎస్ కు చెందిన సీనియర్ సభ్యుడు తిరద్ అల్ జర్బా ను అదుపులోకి తీసుకోవటానికి సాయం చేసే వారికి అమెరికా భారీ బహుమానాన్ని ప్రకటించింది. ఈ నరరూప రాక్షసుడ్ని పట్టిచ్చే సమాచారం ఇచ్చే వారికి ఏకంగా రూ.33కోట్ల రివార్డు ఇస్తామని పేర్కొంది.
= ప్యారిస్ మీద ఉగ్రదాడి ఘటన ఆ దేశంపై తీవ్ర ప్రభావాన్ని చూపినట్లుంది. గతంలో ఎన్నడూ లేనంత సీరియస్ గా ఐఎస్ తీవ్రవాదుల మీద ఆ దేశం దృష్టి సారించింది. దీనికి మద్దుతుగా ఉగ్రదాడి సందర్భంగా విధించిన అత్యవసర పరిస్థితిని మరో మూడు నెలలకు పొడిగిస్తూ ఎంపీలు ఓటు వేశారు.
= తమ దేశంపై రసాయన దాడుల ముప్పు ఉందన్న ఆందోళనను ఫ్రాన్స్ ప్రధాని వాల్స్ హెచ్చరిస్తున్నారు. ఉగ్రదాడులకు అవకాశం ఉందన్న వార్తల్ని మరింత జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉందంటున్నారు.
= అమెరికా ఇచ్చిన సమాచారంతో ఇటలీలో ఉగ్రవాదుల కోసం సోదాలు నిర్వహిస్తున్నారు.
= బెల్జియంలోనూ ఉగ్రవాదుల ఆచూకీ కోసం విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదంపై పోరుకు తగినట్లుగా దేశ రాజ్యాంగాన్ని మారుస్తామని బెల్జియం ప్రధాని ఛార్లెస్ మైఖేల్ చెబుతున్నారు.
= న్యూయార్క్ మీద భారీ ఉగ్రదాడి జరగనుందా? అవునని చెప్పేలా తాజాగా ఐఎస్ ఒక వీడియోను విడుదల చేసింది. న్యూయార్క్ లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్.. హెరాల్డ్ స్క్వేర్.. మిడ్ టౌన్.. మ్యాన్ హటన్ కూడలి చిత్రాల్ని విడుదల చేయటం.. ఒక సూసైడర్ బాంబర్ భారీ విస్పోటక సామాగ్రిని తన చొక్కా లోపల పెట్టుకొని జిప్ వేసుకుంటున్న దృశ్యాల్ని విడుదల చేశారు. దీంతో.. అమెరికా మరింత అలెర్ట్ అయ్యింది.
= ప్యారిస్ ఉగ్రదాడి అనంతరం.. సిరియాలోని ఐఎస్ సంస్థ స్థావరాలపై దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. గడిచిన 24 గంటల్లో సిరియాలోని దాదాపు 35 స్థావరాల్ని ధ్వంసం చేసినట్లుగా చెబుతున్నారు.
= భారత్ లో ఉగ్రదాడికి ఐఎస్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆ సంస్థ భారత్ లో తన జాడల్ని విస్తరించినట్లుగా చెప్పే లష్కరే తోయిబాతో కలిసి ప్లాన్ చేస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు.