Begin typing your search above and press return to search.

ట్రంప్ గెలుపుకోసం ఉగ్రవాదుల ప్రార్థనలు!

By:  Tupaki Desk   |   30 Aug 2016 12:23 PM GMT
ట్రంప్ గెలుపుకోసం ఉగ్రవాదుల ప్రార్థనలు!
X
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయంపై రకరకాల సర్వేల్లో భిన్నాభిప్రాయాలు వెళ్లువెత్తుతున్నాయి. హిల్లరీ కంటే ముందంజలో ఉన్నారని ఒకవారం - వెనుకబడ్డారని మరోవారం ఇలా రకరకాలుగా సర్వేలు వెలువడుతున్నాయి. అయితే తాజాగా డొనాల్డ్ ట్రంప్ గెలుపును అమెరికా ప్రజలు - ప్రపంచ దేశాల ప్రజలు ఎంతమేరకు కోరుకుంటున్నారో కానీ.. ఉగ్రవాదులు మాత్రం డొనాల్డ్ ట్రంప్ గెలవాలని, అమెరికాకు అధ్యక్షుడు అవ్వాలని కోరుకుంటున్నారు. ఈ మేరకు ఫారిన్ ఎఫైర్స్ మేగజైన్ ఈ విషయం వెల్లడించింది.

అమెరికాకు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైతే... ఆయన దూకుడు నిర్ణయాల కారణంగా అమెరికా స్వీయ వినాశనం తప్పదని ఐసిస్ ఉగ్రవాదులు నమ్ముతున్నట్లు ఫారిన్ ఎఫైర్స్ మేగజైన్ తాజాగా తెలిపింది. ఉగ్రవాద సంస్థలనును నిర్మూలిస్తానని, ఉగ్రవాదులు కనిపించకుండా చేస్తానని ఒకపక్క అమెరికా రిపబ్లిక్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తుంటే.. మరోపక్క ఆయన గెలువాలని - అమెరికా అధ్యక్షుడు అవ్వాలని ఐసిస్ ఉగ్రవాద సంస్థ ఏకంగా ప్రార్థనలు చేస్తోంది.

ట్రంప్ నిలకడలేని మనిషని, ముస్లిం వ్యతిరేకని.. అదే ఐసీస్ కు కలిసి వచ్చే అవకాశమని ఐసిస్ మద్దతుదారుల ఇంటర్వ్యూలు - సోషల్ నెట్వ్ర్కింగ్ సైట్లలోని పోస్టులను ఆ పత్రిక పరిగణలోకి తీసుకుంది. తమ ప్రార్థనలు ఫలించి ట్రంప్ అగ్రరాజ్యానికి అధ్యక్షుడు అయితే.. ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం సమాజం ఏకమవుతుందని, అప్పుడు ప్రపంచం మొత్తం ఇస్లాం మద్దతు - ఇస్లాం వ్యతిరేక వర్గాలుగా చీలి ప్రపంచ యుద్ధం జరుగుతుందని ఉగ్రవాదులు విశ్వసిస్తున్నారట. డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కంటే ట్రంప్ వస్తేనే తమకు లాభమని ఐసిస్ మద్దతుదారులు బలంగా విశ్వసిస్తున్నారని ఆ మేగజైన్ పేర్కొంది.