Begin typing your search above and press return to search.

ఐఎస్ లో అందుకోసమే చేరుతున్నారట

By:  Tupaki Desk   |   14 July 2016 4:27 AM GMT
ఐఎస్ లో అందుకోసమే చేరుతున్నారట
X
అల్ ఖైదా అగ్రనేత.. దివంగత బిన్ లాడెన్ గురించి కొత్త విషయాన్ని చెప్పుకొచ్చారు లండన్ మాజీ మేయర్ బోరిస్ జాన్సన్. తాజాగా లండన్ లో మాట్లాడిన ఆయన బిన్ లాడెన్ పోర్న్ ఎడిక్ట్ గా అభివర్ణించారు. పాకిస్థాన్ లోని అబాటోబాద్ లోని లాడెన్ నివాసంపై అమెరికా దళాలు మెరుపుదాడి చేసి మట్టుబెట్టిన సందర్భంగా ఆయన ఇంటి నుంచి పెద్ద ఎత్తున సీడీలు స్వాధీనం చేసుకున్నారని.. ఆ సీడీలన్నీ పెద్ద ఎత్తున పోర్న్ సినిమాలు ఉన్నాయన్నారు.

పోర్న్ సినిమాల నేపథ్యంలోనే ఐఎస్ లోకి ఉగ్రవాదులు విపరీతంగా చేరుతున్నట్లుగా ఆయన ఆరోపించారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులంతా పోర్న్ కు బానిసలుగా ఆయన అభివర్ణించారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులు గతంలో లైంగిక వికృత చేష్టలకు పాల్పడినట్లుగా తమ దర్యాప్తులో తేలిన విషయాన్ని ప్రస్తావించిన ఆయన.. జిహాదీల ల్యాప్ టాప్ ల నిండా పోర్న్ సినిమాలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. జిహాదీలను సైకోపాత్ లుగా ఆయన అభివర్ణించటం గమనార్హం.