Begin typing your search above and press return to search.
ఐసిస్ వాడేది హైదరాబాద్ బాంబులే!
By: Tupaki Desk | 1 March 2016 5:54 AM GMTఉగ్రవాద కార్యకలాపాల్లో ఇప్పటికే సేఫ్ జోన్ గా ఉన్న హైదరాబాద్ లో ఇపుడు మరోకోణం వెలుగు చూసింది. ఈ దఫా తీవ్రవాదులకు షెల్టర్ ఇవ్వడం వంటి రొటీన్ తరహాలో కాకుండా అంతర్జాతీయ అరాచక మూట అయిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ ఆండ్ సిరియాకు చేస్తున్న ప్రమాదకర సహాయం తెరమీదకు వచ్చింది. ఈ రాక్షస ఉగ్రవాద సంస్థ పేలుళ్లకు ఉపయోగిస్తున్న బాంబుల తయారీకి హైదరాబాద్ కు చెందిన మూడు కంపెనీల ముడి సరుకును వినియోగిస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఓ అంతర్జాతీయ సంస్థ పరిశోధనలో ఈ విషయం తేటతెల్లం అయింది.
ప్రపంచవ్యాప్తంగా ఉగ్రదాడులు జరుగుతున్న నేపథ్యంలో దాడులకు వినియోగించే బాంబులు - ముడి పదార్థాలను కనిపెట్టేందుకు కాన్ ఫ్లిక్ట్ ఆర్మమెంట్ రీసెర్చ్ (సీఏఆర్) సంస్థను యురోపియన్ యూనియన్ నియమించింది. కరుడు గట్టిన ఐసిస్ ఉగ్రవాద సంస్థకు మందు పాతర్లు - పేలుడు పదార్థాల సరఫరాపై నిషేధం ఉంది. అయినా ఈ సంస్థ ఇరాక్, సిరియా దేశాల్లో మారణహోమం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో సిఏఆర్ సంస్థ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఐసిస్ ఉగ్రవాద సంస్థ తయారు చేస్తున్న బాంబులకు హైదరాబాద్‌కు చెందిన మూడు ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీలకు చెందిన ముడి పదార్థం - విడిభాగాలు - మందు పాతర్లు - సేఫ్లీ ఫ్యూజులు సరఫరా అవుతున్నట్టు కాన్ ఫ్లిక్ట్ ఆర్మమెంట్ రీసెర్చ్ (సీఏఆర్) సంస్థ గుర్తించింది.
హైదరాబాద్ కు చెందిన ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ ఇండియా - జిఓసిఎల్ కార్పొరేషన్ - ఐడిసి ఇండస్ట్రియల్ ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీల ముడి పదార్థాలను కనుగొన్నట్టు సమాచారం. పారిశ్రామిక అవసరాల పేరుతో టర్కీ, లెబనాన్ దేశాలకు చెందిన పలు సంస్థలు డిటొనేటర్లు - డిటోనేటర్ కార్డులు - సేఫ్టీ ఫ్యూజులను హైదరాబాద్ నుంచి తెప్పించుకుంటున్నాయి. అక్కడి నుంచి ఈ విడిభాగాలు ఐసిస్ కు చేరుతున్నట్టు తెలిసింది.
కొసమెరుపుః హైదరాబాద్ నుంచి ఎగుమతి అవుతున్న ఈ పేలుడు పదార్థాలు - బాంబుల తయారీకి ఉపయోగించే విడిభాగాలు ఎవరి చేతుల్లోకి చేరుతున్నాయన్నది ఈ కంపెనీలకు కూడా తెలిసే అవకాశం లేదని సీఆర్ ఏ సంస్థ పరిశోధనలో వెల్లడైనట్టు సమాచారం.