Begin typing your search above and press return to search.
మోడీ కుట్ర బట్టబయలైంది
By: Tupaki Desk | 3 Dec 2015 4:04 PM GMTప్రధానమంత్రి నరేంద్ర మోడీ కుట్ర తేటతెల్లం అయింది. తను నంబర్ వన్ కావడానికి ఆయన వేసిన ఎత్తుగడను ఆయన శత్రువులు పసిగట్టాయి. ఈ మేరకు వాటన్నింటినీ ప్రస్తావిస్తూ ఏకంగా మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇంతకీ మోడీ చేసిన ఆ కుట్ర ఏంటి? దాన్ని విడుదల చేసిన ఆయన శత్రువులు అనబడే ప్రత్యర్థులు ఎవరు అనుకుంటున్నారా?ప‌్రపంచ వ్యాప్తంగా బీతావహ చర్యలకు కేరాఫ్ అడ్రస్ ఐసిస్ ఉగ్రవాదులు ఈ మేరకు మోడీ ఆలోచనలు పసిగట్టామని ప్రకటించాయి.
ప్రధాని నరేంద్రమోడీ ముస్లింలను తమ ఏకైక శత్రువుగా భావిస్తున్నాడని ఐఎస్ ఉగ్రవాదులు తేల్చిచెప్పారు. వారిపై పోరాటం చేయడానికి... హిందూత్వ వాది అయిన మోడీ కృషి చేస్తున్నారని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ప్రకటించారు. 'ఇస్లామిక్ స్టేట్‌నుంచి నల్ల జెండాలు' (బ్లాక్ ఫ్లాగ్స్ ఫ్రమ్ ఇస్లామిక్ స్టేట్ ) పేరిట ఐసిస్ తమ నూతన మేనిఫెస్టోను వెలువరించింది. అందులో మోడీని ముస్లింలపై యుద్ధానికి ప్రజలను ఉసిగొలిపే చర్యలకు పాల్పడుతున్నారంటూ దుయ్యబట్టింది.
ఇస్లామిక్ స్టేట్ ఇరాక్, సిరియాలనుంచి విస్తరించనున్నదని, ఇకపై భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ తదితర దేశాల్లో తన కార్యకలాపాలను నిర్వహిస్తుందని ఆ మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు ఒక ఆంగ్ల పత్రికలో కథనం ప్రచురితమైంది. 'నరేంద్రమోడీ హిందూత్వవాది అని, ఆయుధాలను పూజిస్తారని, భవిష్యత్తులో ముస్లింలపై యుద్ధానికి తన ప్రజలను సమాయత్తం చేస్తున్నారు' అని ఉగ్రవాదుల మేనిఫెస్టోలో పేర్కొన్నారు. 'మోడీ ప్రచారం కోసం, నియామకాల కోసం ఒక రాజకీయవిభాగం ఉంది, ఆయుధాలతో కూడిన సేనలను తయారు చేస్తున్నారు. తమ నెంబర్ వన్ శత్రువైన ముస్లింలను భీతావహుల్ని చేసే ప్రచారాన్ని ప్రారంభించవచ్చు' అంటూ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. కొన్ని ఆన్‌లైన్‌లో కొన్ని జిహాదీ వెబ్‌సైట్లలో ఉగ్రవాదులు మేనిఫెస్టోను విడుదల చేశారు.