Begin typing your search above and press return to search.

ఐసిస్ అడ్డాగా హైద‌రాబాద్?

By:  Tupaki Desk   |   25 March 2017 6:20 AM GMT
ఐసిస్ అడ్డాగా హైద‌రాబాద్?
X
ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేకెత్తిస్తున్న ఉగ్ర‌వాద సంస్థ ఐసిస్ త‌న సామ్రాజ్యాన్ని హైద‌రాబాద్‌ కు విస్త‌రించిందా? ఇక్క‌డ పెద్ద ఎత్తున ఆయుధాల మాఫియాను ఐసిస్ న‌డిపిస్తోందా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. హైద‌రాబాద్ పాతబస్తీలోని హబీబ్‌ నగర్‌ లోని ఓ ఇంటిపై సీసీఎస్‌ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో అనేక ఆశ్చ‌ర్య‌క‌ర విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఈ ఇంట్లో భారీస్థాయిలో అక్రమ ఆయుధాలు దొరికాయి. అంతేకాకుండా నంబర్‌ కనిపించకుండా ఇతర దేశాలకు కాల్స్ చేసే రాకెట్ బ‌య‌ట‌ప‌డింది. సెల్‌ టాప్‌ బాక్స్‌ - ఇతర పరికరాలతో పాటు ఐదు ఎయిర్‌ గన్‌ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పహాద్‌ అనే యువకుడితో పాటు మరొకరిని అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు.

అక్ర‌మ ఆయుధాలు, కాల్ డైవ‌ర్టింగ్ రాకెట్ బ‌య‌ట‌ప‌డంతో పాకిస్థాన్‌ కు కూడా ఈ అంతర్జాతీయ కాల్స్‌ ను డైవర్ట్‌ చేస్తుండటంతో ఐసిస్‌తో సంబంధాలున్నాయా? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. హబీబ్‌ నగర్‌ - రాజేంద్రనగర్‌ లో అసాంఘిక కార్య కలాపాలపై నిఘా పెట్టిన పోలీసులు విదేశాల నుంచి కాల్‌ చేసినట్లు చూపించే రూటర్‌ లు - ల్యాప్‌ ట్యాప్‌ ఇతర సాంకేతిక పరికరాలు చూసి విస్తుపోయారు. అసలు వారేం చేస్తున్నారు? వారి వ్యూహమేంటి? ఇంత ఖరీదైన ఇన్ని ఎయిర్‌ గన్‌ లు ఎందుకు ఉంచుకున్నారు? వంటి వివరాలపై పోలీసులు సమాచారం రాబడుతున్నారు. పక్కా సమాచారం ఆధారంగా పోలీసులు ఇంటిపై దాడి చేసి ఇద్దరిని అరెస్టు చేశారని స‌మాచారం. అయితే పోలీసులు మాత్రం ఒకరినే అరెస్ట్‌ చేశామని చెబుతున్నారు.

బంగ్లాదేశ్‌ నుంచి తీవ్రవాదులు భారత్‌ లో ప్రవేశించారన్న నివేదికల నేపథ్యంలో భారీగా ఆయుధాలు పట్టుబడటం తీవ్ర కలకలం రేపుతోంది. మారణాయుధాలు పట్టుబడటం, పాకిస్థాన్‌కూ ఈ అంతర్జాతీయ కాల్స్‌ డైవర్ట్‌ చేస్తుండటంతో ఐసిస్‌తో సంబంధాలున్నాయా? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మళ్లీ నగరంలో భారీ కుట్రకు ఐసిస్‌ పన్నాంగం పన్నిందా? పట్టుబడిన ఆయుధాలన్నీ అత్యంత ఖరీదైన ఎయిర్‌గన్‌లు కావడంతో విధ్వంస కుట్ర ఏమైనా ఉందా అన్న కోణంలో పోలీసుల విచారణ సాగుతోందని సమాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/