Begin typing your search above and press return to search.

ఐఎస్ ఐఎస్ కమీషన్ రిక్రూట్ మెంట్

By:  Tupaki Desk   |   17 Oct 2015 10:03 AM GMT
ఐఎస్ ఐఎస్ కమీషన్ రిక్రూట్ మెంట్
X
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ - సిరియా(ఐసిస్) ఉగ్రవాద సంస్థ ప్రపంచాన్ని ఎలా వణికిస్తుందో చెప్పనవసరం లేదు. ఈ నరహంతక ఉగ్రవాద సంస్థ అన్ని దేశాల్లోనూ ఇంత వేగంగా ఎలా విస్తరిస్తుందన్న అనుమానం చాలామందిలో ఉంది. అందుకు సమాధానం దొరికింది. సంస్థలో కొత్తవారిని నియమించడంలో ఐసిస్ ఖర్చుకు ఏమాత్రం వెనుకాడడం లేదట.. అందుకే రోజురోజుకీ అది విస్తరిస్తోందని చెబుతున్నారు. ఐఎస్ ఐఎస్ లో ఒక వ్యక్తిని చేర్చితే. కమీషన్ గా పదివేల డాలర్ల వరకు (సుమారు రూ.65 లక్షలు) ఇస్తుందట. ఈ విషయం బయటపెట్టింది ఎవరో కాదు, సాక్షాత్తు ఐక్యరాజ్య సమితి వద్ద దీనికి సంబంధించిన ఆధారాలున్నాయట. బెల్జియంలో పర్యటించిన ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు ఈ సంగతి వెల్లడించారు.బెల్జియం నుంచి చాలామంది ఐసిస్ లో చేరుతుండడంతో ఐరాస అధ్యయన బృందం అక్కడ పర్యటిస్తోంది.

ఇరాక్ - సిరియాలో పనిచేస్తున్న ఐసిస్ ఉగ్రవాదుల్లో 500 మందికిపైగా బెల్జియం యువకులు ఉన్నారని సమాచారం. ఐసిస్ లో చేరుతున్న ఐరోపా దేశాలవారిలో బెల్జియం వారే ఎక్కువగా ఉంటున్నారు. దీంతో ఐసిస్ పెద్ద మొత్తంలో డబ్బు వెదజల్లుతూ ఉగ్రవాదులను రిక్రూట్ చేసుకుంటోంది.

కొత్తగా చేర్చే వ్యక్తుల సామర్థ్యాల ఆధారంగా రిక్రూటర్లకు ఐఎస్ ఐఎస్ చెల్లింపులు చేస్తోందట. 2000 డాలర్ల నుంచి 10000 డాలర్ల వరకు కమీషన్ గానే ఇస్తుందట. బాగా చదువుకున్నవాళ్లు - కంప్యూటర్ స్పెషలిస్టులు - వైద్యులు వంటివారిని చేర్చితే ఎక్కువమొత్తం చెల్లింపులు జరుపుతోంది. దీంతో ఇలాంటి కమీషన్ ఏజెంట్లు చాలామంది తయారవుతున్నారు. దాదాపు అన్ని దేశాల్లోనూ ఐసిస్ ఇదే విధానాలు అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదిని చేర్చితేనే ఇంత కమీషన్ ఇస్తుంటే ఇందులో చేరినవారికి ఇంకెంత ఇస్తున్నారో అని ఐక్యరాజ్యసమితి వర్గాలు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నాయి.