Begin typing your search above and press return to search.

కొత్త విధ్వంసానికి తెర తీసిన ఐసిస్

By:  Tupaki Desk   |   7 Nov 2019 4:58 AM GMT
కొత్త విధ్వంసానికి తెర తీసిన ఐసిస్
X
ఆరాచకాన్ని నమ్ముకోవటం.. దుర్మార్గాలతో తాము నమ్మిన సిద్దాంతాన్ని అమలు చేయాలన్న పైశాచికత్వం ఐసిస్ సొంతం. విధ్వంసంతో తమ కలల ప్రపంచాన్ని సాధించాలని నమ్మే ఈ మూక అధినేత బాగ్దాదీని ఇటీవల అమెరికా దళాలు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో హతమార్చటం తెలిసిందే. ఇలాంటి వేళ.. ఐసిస్ ఇచ్చిన పిలుపు ప్రపంచ దేశాల్ని వణికేలా చేస్తోంది.

ఓపక్క పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రపంచాన్ని కాపాడాలంటే పర్యావరణాన్ని కాపాడుకోవాలన్న డిమాండ్ వినిపిస్తున్న వేళ.. ఇందుకు భిన్నంగా జిహాదీలో భాగంగా అమెరికా.. యూరప్ దేశాల్లోని అడవులకు నిప్పు పెట్టాలంటూ ఐసిస్ క్యాడర్ కు దాని ప్రచార సంస్థ ఖురేశ్ పిలుపునివ్వటం ఆందోళనను రేకెత్తిస్తోంది.

కాలిపోర్నియా.. స్పెయిన్ లో ఇటీవల చెలరేగిన కార్చిచ్చు అక్కడి ప్రజల్లో పెద్ద ఎత్తున భయాందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. అడవుల్ని కాల్చేయాలని.. నిప్పు పెట్టాలంటూ ఐసిస్ ప్రచారం చేస్తోంది. అమెరికా.. బ్రిటన్.. ఫ్రాన్స్ తదితర దేశాల్లో అడవుల్ని తగలెట్టి ప్రజల్లో భయాందోళనలకు గురి చేయాలని.. పర్యావరణ పరిస్థితుల్ని మరింతగా దిగజార్చాలన్న దుర్మార్గానికి ఐసిస్ తెర తీసింది. సోషల్ మీడియాలో తాజాగా విడుదల చేసిన పోస్టర్లతో తన సానుభూతిపరులకు విన్నవించింది.

బాగ్దాదీని హతమార్చిన తర్వాత కూడా ఐసిస్ తన ప్రచారాన్ని మానుకోలేదు. అడవుల్ని ఇష్టారాజ్యంగా తగలబెట్టేయటం ద్వారా పర్యావరణాన్ని దెబ్బ తీయాలని.. అదే సమయంలో ప్రభుత్వాలకు నిద్ర లేకుండా చేయాలన్నదే ఆలోచనగా చెబుతున్నారు. ఈ తీరుపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.