Begin typing your search above and press return to search.
గుళ్లల్లో ఆవు మాంసంతో అల్లకల్లోలం చేసేలా స్కెచ్
By: Tupaki Desk | 30 Jun 2016 9:13 AM GMTహైదరాబాద్ పాతబస్తీకి చెందిన వారిని జాతీయ దర్యప్తు బృందం అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రపంచాన్ని వణికిస్తున్న ఐసిస్ ఉగ్రవాద సంస్థకు సానుభూతిపరులుగా ఉన్న వీరంతా.. హైదరాబాద్ మహానగరంలో మతకల్లోలాలు రేపేలా పక్కా ప్లాన్ వేశారు. వాస్తవానికి వారి ప్లాన్ కానీ ఫలించి ఉంటే దారుణ పరిస్థితులు చోటు చేసుకునేవి. తాజాగా వారు పన్నిన కుట్రకు సంబంధించి విస్మయకర వాస్తవాలు బయటకు వచ్చాయి.
నగరంలోని పలు దేవాలయాల వద్ద.. ముఖ్యంగా చార్మినార్ వద్దనున్న భాగ్యలక్ష్మి ఆలయంలో ఆవు.. ఎద్దు మాసం ఉంచాలని ప్లాన్ వేశారు. ఇది భావోద్వేగాల్ని పెంచటంతో పాటు.. మత కల్లోలాల్ని సృష్టిస్తుందని అంచనా వేశారు. భాగ్యలక్ష్మి దేవాలయంతో పాటు.. మరికొన్ని దేవాలయాల వద్ద కూడా ఆవు.. ఎద్దు మాంసం ఉంచాలని అనుకున్నట్లు విచారణలో వెల్లడైంది.
రంజాన్ మాసంలో మతకల్లోలాలు సృష్టించి భారీ అలజడులు జరిగేలా చేయాలని వారు స్కెచ్ వేశారు. అయితే.. వీరి మీద సందేహంతో వీరి ఫోన్లను నిఘా వర్గాలు ట్యాప్ చేశాయి. తాజాగా ఎన్ఐఏ వద్ద అదుపులో ఉన్న నిందితుల్లో ఇద్దరూ జూన్ 25న ఫోన్లో మాట్లాడుకున్నారని.. వీరి మాటలు వీరి కుట్రను బయటపెట్టాయని చెబుతున్నారు.
‘‘నాలుగు ముక్కలు అవు.. ఎద్దు మాంసం తీసుకురావాలని కోరాడు’’ దీంతో మతకల్లోలాలకు ఆజ్యం పోసేలా ప్లాన్ వేసినట్లు అర్థమైన అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. భద్రతా అధికారులు ఏ మాత్రం అలెర్ట్ లేకున్నా.. ఈ దుర్మార్గుల ప్లాన్ వర్క్ వుట్ అయినా హైదరాబాద్ మహానగరంలో పెద్ద ఎత్తున అల్లకల్లోలంగా మారేదనటంలో ఎలాంటి సందేహం లేదని చెప్పాలి.