Begin typing your search above and press return to search.

మ్యూజిక్ విన్నాడని పిల్లాడి తల నరికేశారు

By:  Tupaki Desk   |   18 Feb 2016 5:02 AM GMT
మ్యూజిక్ విన్నాడని పిల్లాడి తల నరికేశారు
X
ఐఎస్ తీవ్రవాదుల దుశ్చర్యలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అడ్డూ ఆపు లేకుండా ఇష్టారాజ్యంగా సాగుతున్న వారి రాక్షసకాండకు తాజా ఉదంతం ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. ఇరాక్ లో తమకు పట్టున్న ప్రాంతమైన మోసూల్ పట్టణంలో ఐఎస్ రాక్షసులు అత్యంత కిరాతకంగా వ్యవహరించారు.

పాశ్చాత్య సంగీతం విన్నాడన్న ఒకే ఒక్క కారణం చూపించి.. ఒక బాలుడ్ని నడిరోడ్డులో నిలబెట్టి తల నరికేయటం సంచలంగా మారింది. మోసూల్ పట్టణంలోని హుస్సేన్ అనే పిల్లాడు తన తండ్రి షాపులో కూర్చొని పాటలు వింటున్నాడు. దీన్ని గుర్తించిన ఐఎస్ రాక్షసులు.. ఆ పిల్లాడ్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం షరియత్ కోర్టులో హాజరు పర్చారు.

పిల్లాడు పాశ్చాత్య సంగీతం వింటున్నాడన్న ఆరోపణ మీద విచారణ జరిపి.. అతడు చేసిన నేరానికి దారుణ శిక్ష విధించారు. నడిరోడ్ లో అందరూ చూస్తుండగా మరణశిక్షను అమలు చేయాలని నిర్ణయించారు. ఇందుకు తగ్గట్లే ఆ చిన్నారిని నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగా తల నరికివేశారు నరరూప రాక్షసులు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపటంతో పాటు.. తీవ్ర నిరసన వ్యక్తమైనట్లు తెలుస్తోంది. పాశ్చాత్య సంగీతంపై బ్యాన్ లేకున్నా.. పిల్లాడ్ని చంపేయటం ఇప్పుడక్కడ సంచలనంగా మారింది.