Begin typing your search above and press return to search.
రాక్షసత్వం ఎలా ఉంటుందో చూస్తారా?
By: Tupaki Desk | 1 Nov 2015 8:33 AM GMTపిచ్చి పీక్ స్టేజీకి చేరితే... మూర్ఖత్వం రాక్షసత్వం స్థాయికి ఎదిగితే...మానవత్వం మంటగలిస్తే.... ఎలా తయారవుతారు? ఏం చేస్తారు? అనే ప్రశ్నలకు సమాధానం.. ఉగ్రవాదులుగా మారుతారు. నరరూప ఐఎస్ఐఎస్ రాక్షసులుగా తయారవుతారు. ఇందుకు గతంలో వారు చేసిన అనేక ఆకృత్యాలే నిదర్శనం. ఈ నరరూప రాక్షసులు చేసిన తాజాగా చేసిన రాక్షసకార్యం. ఈజిప్టు నుంచి రష్యా వెళుతున్న విమానాన్నిఈజిప్టులోని సినాయ్ దీవుల్లో కుప్పకూల్చడం.
ఈ ఘోర ఘటనలో ప్రయాణికుల్లోని 224 మందిలో ఏ ఒక్కరూ మిగల్లేదు. వారితో పాటు ఏడుగురు సిబ్బంది కూడా ఉన్నారు. ఇందులో ముగ్గురు మినహా అందరూ రష్యన్లే. 17 మంది చిన్నారులున్నారు. తుళ్లుతూ పాడుతూ ఎంతో సరాదాగా టూరిస్టు స్పాట్ ల్లో గడిపిన ఈ చిన్నారులంతా, చిధ్రమైన శరీరాల సరసన చేరడం అత్యంత విషాదకరం.
ఆ విమానాన్ని తామే కూల్చివేశామని ప్రకటించిన ఐఎస్ఐఎస్ ఉగ్రమూకలు అందుకు సంబంధించిన తమ రాక్షసత్వాన్ని చాటుకునే ఆధారాలు విడుదల చేశారు. కూల్చివేసిన వీడియో ఒక దానిని సామాజిక మాధ్యమంలో పెట్టారు. రష్యా విమానాన్ని రాకెట్ లాంఛర్లతో కూల్చివేసినట్లుగా అందులో ఉంది. విమానాలను కూల్చివేసేంత సత్తా, సామర్ధ్యం ఐఎస్ఐఎస్ కు లేదని రష్యా - ఈజిప్టులు అభిప్రాయపడుతుంటే....రక్షణ రంగ నిపుణులు మాత్రం అంతటి సాహసానికి ఒడిగట్టే సామర్థ్యం ఐఎస్ ఐఎస్ కు ఉందని అంటున్నారు. భిన్నాభిప్రాయాలు ఎలా ఉన్నా...తమ రాక్షసత్వంతో వందలాది మంది ప్రాణాలు పొట్టనపెట్టుకున్నదే వణుకుపుట్టించే విధంగా వీడియో పెట్టడం ఆ రాక్షసులకే చెల్లింది.