Begin typing your search above and press return to search.

రష్యా విమానాన్ని అంత సింఫుల్ గా పేల్చేశారంట

By:  Tupaki Desk   |   19 Nov 2015 4:14 AM GMT
రష్యా విమానాన్ని అంత సింఫుల్ గా పేల్చేశారంట
X
ఆ మధ్యన రష్యాకు చెందిన ఎ321 విమానం ఆకాశంలో పేలిపోవటం తెలిసిందే. ఈ భారీ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 224 మంది ప్రాణాలు కోల్పోవటం తెలిసిందే. ఈ దుర్ఘటనక సంబంధించి సాంకేతిక లోపం కారణంగానే విమాన ప్రమాదం జరిగిందని తొలుత రష్యా పేర్కొంది. అయితే.. అలాంటేదేమీ లేదని.. తామే విమానాన్ని పేల్చేశామని ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద సంస్థ పేర్కొంది. దీన్ని రష్యా ఖండించింది. ఐసిస్ దగ్గర విమానాల్ని పేల్చేసే అత్యాధునిక వ్యవస్థ లేదని.. ఇదంతా నిజమని వాదించింది. అయితే.. తాము వినియోగించిన సాంకేతికతను బయటకు చెప్పని ఐసిస్.. విమానాన్ని కూల్చింది మాత్రం తామేనని పేర్కొంది.

పలువిధాలుగా విచారణ జరిపిన రష్యా ప్రభుత్వం.. చివరకు విమాన ప్రమాదానికి కారణం ఐసిస్ అన్న విషయాన్ని తేల్చారు. ఈ నేపథ్యంలో ఐసిస్ స్థావరాలపై దాడులకు పాల్పడింది కూడా. తాజాగా.. రష్యా విమానాన్ని తాము ఏ విధంగా పేల్చేసిన విషయాన్ని ఐసిస్ వెల్లడించింది. చాలా సింఫుల్ గా విమానాన్ని పేలిపోయేలా చేశామని పేర్కొంది.

పైన్ యాపిల్ డ్రింక్ క్యాన్ లో బాంబును ఉంచి పేల్చినట్లుగా పేర్కొనటమే కాదు.. అదెలా చేశామో కూడా వెల్లడించింది. ఇక.. తాము రూపొందించిన బాంబును ప్రధాన క్యాబిన్ లో ఉంచామని.. సినాయ్ ప్రాంతంలో విమానం ప్రయాణిస్తున్న సమయంలో బాంబు కారణంగా విమానం రెండు ముక్కలు కావటంతో పాటు.. అందులో ప్రయాణిస్తున్న 224 మంది చనిపోయినట్లుగా పేర్కొంది. చాలా తేలికైన పద్ధతిలో ఇంత భారీ దారుణానికి ఐసిస్ పాల్పడటం ఇప్పుడు పలువురిని విస్మయానికి గురి చేస్తోంది.