Begin typing your search above and press return to search.
ఐసిస్ గురించి మన దగ్గర ఆరా తీస్తున్నారు
By: Tupaki Desk | 16 March 2017 4:50 PM GMTఅంతర్జాతీయ ఉగ్రమూక ఇస్లామిక్ స్టేట్ కు మనదేశంలో ఉన్న లింకులను ఆరా తీసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ ఐఏ) రంగంలోకి దిగింది. ఐసిస్ ఉగ్రవాదుల నుంచి నిధుల అందుకున్న ఆరుగురు తమిళనాడు వ్యక్తుల కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు. ఈ కేసును ఎన్ ఐఏ విచారిస్తోంది. నిధులు స్వీకరించిన ఆరుగురు సుమారు పన్నెండు మందికి సహాయపడ్డట్టు తెలుస్తోంది. ఈ నిధులతో నిందితులు కొందర్ని సిరియా - ఇరాక్ దేశాలకు పంపించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల్లో తెలంగాణకు చెందిన నౌమన్ జెలీల్ కూడా ఉన్నాడు.
ఇప్పటికే మొత్తం తొమ్మిది మందిపై ఎన్ ఐఏ పోలీసులు కేసు నమోదు చేశారు. దాయిష్ లేదా ఇస్లామిక్ స్టేట్ కార్యకలాపాలను భారత్ లో విస్తరింపచేసేందుకు వీళ్లు ప్రయత్నించినట్లు పోలీసులు భావిస్తున్నారు. చెన్నైలో ఈ గ్యాంగ్ కు కుట్రకు పాల్పడినట్లు నిర్ధారించారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ నుంచి నిధులు అందుకున్న ఈ గ్యాంగ్ ప్రత్యేకంగా క్యాంపులను నిర్వహించినట్లు బయటపడింది. గత ఏడాది హైదరాబాద్ కు చెందిన సివిల్ ఇంజినీర్ జలీల్ ను పోలీసులు అరెస్టు చేసి విచారించారు. కొందరు అనుమానితుల అంశంలో సాక్షిగా మారాలని ఎన్ ఐఏ ఒత్తిడి తెలుస్తున్నట్లు అతను ఓ మీడియా సమావేశంలో వెల్లడించాడు. ఐసిస్ కు అనుకూలంగా కార్యక్రమాలు చేపట్టిన జలీల్ ను గత ఏడాది పోలీసులు అరెస్టు చేసి ఆ తర్వాత విడుదల చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/